Share News

పిల్లలకు క్రమశిక్షణ నేర్పిద్దాం!

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:02 AM

తల్లిదండ్రులు ఓపికగా వ్యవహరిస్తేనే పిల్లలు చెప్పినమాట విని క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు......

పిల్లలకు క్రమశిక్షణ నేర్పిద్దాం!

తల్లిదండ్రులు ఓపికగా వ్యవహరిస్తేనే పిల్లలు చెప్పినమాట విని క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు...

  • పిల్లలను చీటికీ మాటికీ కోప్పడకుండా వాళ్లు చేసే పనులను గమనిస్తూ ఉండాలి. మొదట పిల్లలు చేసిన పనిని పొగిడి చిన్న బహుమతి ఇస్తే చాలు. తరవాత తల్లిదండ్రులు ఏమి చెప్పినా పిల్లలు వినడానికి సిద్దంగా ఉంటారు.

  • తల్లిదండ్రులు ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి. వాళ్లతో మాట్లాడుతూ ఆటలు ఆడించాలి. దీంతో పిల్లలు తమ భావాలను తల్లిదండ్రులతో పంచుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే పిల్లలకు మంచి చెడూ వివరించి చెప్పాలి.

  • పిల్లలు ఏ విషయమైనా చెబుతున్నప్పుడు శ్రద్దగా వినాలి. తరవాత వాళ్లు అడిగే ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు చెప్పాలి. పిల్లలవైపు చూస్తూ మృదు స్వరంతో లాలనగా సంభాషించాలి. అప్పుడే తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని గుర్తుపెట్టుకోవాలనే భావన పిల్లల్లో కలుగుతుంది.


  • పిల్లలతో ప్రేమగా, ప్రశాంతంగా, సహనంగా వ్యవహరించాలి. ఇదే క్రమంలో నైతిక విలువలు, మర్యాద, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, స్నేహం, దయ, సహాయం లాంటి వాటి గురించి వివరించి చెప్పాలి. దీంతో పిల్లలు పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకోగల్గుతారు.

  • సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం, హోంవర్క్‌, పుస్తకాలు సర్దుకోవడం, వ్యక్తిగత శుభ్రతల గురించి పిల్లలకు తెలియజెప్పాలి. దీనివల్ల పిల్లలకు స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది.

  • ఇంటి పనుల్లో పిల్లలను భాగస్వాములను చేయాలి. స్నేహితులు, బంధువులతో మాట్లాడే విధానాన్ని వివరించి చెప్పాలి.

  • స్కూల్‌ బ్యాగ్‌ సర్దుకోవడం, డైనింగ్‌ టేబుల్‌ క్లీన్‌ చేయడం, బట్టలు-బొమ్మలను నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచడం లాంటి పనులను పిల్లలకే వదిలివేస్తే వాళ్లలో బాధ్యత, స్వతంత్ర భావాలు పెరుగుతాయి. ముందుజాగ్రత్త అలవడుతుంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 06 , 2025 | 06:03 AM