Kiwi Health Benefits: మినరల్స్ విటమిన్ల గని
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:34 AM
కివీ... ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే కానీ మన ఆహారంలో చేర్చుకొంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్-సి, ఎ, ఇ విటమిన్లు లభిస్తాయి. పొటాషియం, కేల్షియం, మెగ్నీషియం...
కివీ... ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే కానీ మన ఆహారంలో చేర్చుకొంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్-సి, ఎ, ఇ విటమిన్లు లభిస్తాయి. పొటాషియం, కేల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి మినరల్స్‌తో పాటు డైటరీ ఫైబర్ కూడా పుష్కలం. పిండిపదార్థాలు, కేలరీలు తక్కువ.
రోగనిరోధకశక్తి: కివీలో సి-విటమిన్ అధికంగా లభిస్తుంది. హానికర వ్యాధులు, వైర్‌సలతో పోరాడే యాంటీఆక్సిడెంట్‌లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. తరచూ ఇబ్బందిపెట్టే జలుబు, ఫ్లూ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. కివీలోని విటమిన్-ఇ శరీరంలో టి-సెల్స్ కౌంట్‌ను పెంచుతుంది. మొత్తంగా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా కివీని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమికి: కివీలోని సెరోటోనిన్ నిద్రలేమి సమస్యకు చక్కగా పని చేస్తుంది. పడుకోబోయే ముందు ఒక పండు తింటే సుఖనిద్ర పడుతుంది. అలాగే దీనిలో నారింజ, నిమ్మలో కంటే రెండు రెట్లు అధికంగా సి-విటమిన్ కివీలో లభిస్తుంది. దగ్గు, ముక్కు కారడం, శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణక్రియ: కివీలో ఉండే డైటరీ ఫైబర్, ఆక్టినిడైన్ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బొప్పాయిలోని పపైన్, పైనాపిల్‌లోని బ్రోమేలైన్‌లా కివీలోని ఆక్టినిడైన్ పని చేస్తుంది. పెరుగు, ఛీజ్, చేపలు, గుడ్లలో ఉండే కొన్ని పోషకాలు అరగడానికి సహకరిస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్యను తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి