Job Openings: ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:42 AM
దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లో గ్రౌండ్‌స్టాఫ్, లోడర్ ఖాళీల భర్తీకి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతోంది. పది, ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు...
దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లో గ్రౌండ్‌స్టాఫ్, లోడర్ ఖాళీల భర్తీకి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతోంది. పది, ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టులు:
ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: 1017
లోడర్(పురుషులు మాత్రమే): 429
అర్హత: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి ఇంటర్ పాసై ఉండాలి. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం 25 వేల నుంచి 35 వేల వరకు ఉంటుంది.
లోడర్ పోస్టుకి పది పాసైన పురుషులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే విడివిడిగా దరఖాస్తు పంపాలి. వయస్సు 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది.
చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 21
వెబ్‌సైట్: igiaviationdelhi.com/
ఇవి కూడా చదవండి
నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి