Artificial Blood: కృత్రిమ రక్తం
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:51 AM
జపాన్ శాస్త్రవేత్తలు ఎవరైనా ఉపయోగించుకోగల కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేశారు. ఈ సింథటిక్ రక్తం ప్లేట్‌లెట్లు, ఎర్ర రక్తకణాలు కలిగి ఉండి, సంవత్సరంమంతా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయగలగడం విశేషం.
రక్తదానం ప్రాణదానంతో సమానం. కానీ అనేక సందర్భాల్లో సమయానికి సరిపడా రక్తం దొరకక, సరిపోలే రక్తగ్రూపు అందుబాటులో లేక సర్జరీలు వాయిదా పడుతూ ఉండడం, ప్రాణనష్టం సంభవించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెల్లుచీటీ రాస్తూ, నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీకి చెందిన జపాన్ పరిశోధకులు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు.
ఈ కృత్రిమ రక్తాన్ని రక్తపు గ్రూపు మ్యాచింగ్‌తో సంబంధం లేకుండా, ఎవరైనామార్పిడి చేసుకోవచ్చు. ఈ సింథటిక్ రక్తంలో ఎర్ర రక్త కణాలతో పాటు, ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇప్పటివరకూ చేపట్టిన జంతు ప్రయోగాల్లో ఈ రక్తంతో విజయవంతంగా రక్త నష్టాన్ని భర్తీ చేయగలిగారు. దానం చేసిన రక్తానికి భిన్నంగా ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఏకంగా ఏడాది పాటు నిల్వ చేసుకుని, అత్యవసర సమయాల్లో, మారుమూల ప్రాంతాలకు తరలించడానికి ఉపయోగించుకోవచ్చు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి