Jaggery Tea Benefits: ఆరోగ్యానికి బెల్లం టీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:10 AM
ప్రస్తుతం పంచదారకు బదులు బెల్లం వినియోగం అధికమైంది. టీని కూడా బెల్లంతోనే తయారుచేసుకుంటున్నారు. పాలు, టీ పొడి లేకుండా కూడా బెల్లం టీ తయారు చేసుకోవచ్చు.
ప్రస్తుతం పంచదారకు బదులు బెల్లం వినియోగం అధికమైంది. టీని కూడా బెల్లంతోనే తయారుచేసుకుంటున్నారు. పాలు, టీ పొడి లేకుండా కూడా బెల్లం టీ తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు వేడివేడి నీళ్లలో కొద్దిగా బెల్లం కరిగించి ఒక చెంచా నిమ్మరసం కలిపితే చాలు. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
రోజూ బెల్లం టీ తాగితే అలసట, నీరసం తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో ఆమ్లత్వం, పొట్ట ఉబ్బరించడం, మలబద్దకం తగ్గి పేగులు శుభ్రపడతాయి. రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. బెల్లంలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, పలు రకాల మినరల్స్... శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. బెల్లంలో ఉండే ఐరన్... రక్తహీనతను పోగొడుతుంది. శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
రోజుకు రెండుసార్లు బెల్లం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకున్న టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శ్వాసకోశ వ్యవస్థ, లివర్, రక్తం పూర్తిగా శుభ్రపడతాయి. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కాబట్టి వ్యాయామం చేసేముందు కొద్దిగా బెల్లం టీ తాగడం మంచిది.
తరచూ బెల్లం టీ తాగడం వల్ల జీవక్రియలు వేగవంతమవుతాయి. దీంతో శరీర బరువు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, ఎముకల సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, నిద్రలేమి లాంటి సమస్యల నివారణకు బెల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.
బెల్లం టీ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీన్ని తాగితే వెచ్చగా ఉన్న అనుభూతి కల్గుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి