SSC Technical Entry 2025: ఇంజనీరింగ్ డిగ్రీతో ఇండియన్ ఆర్మీలోకి
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:09 AM
ఇండియన్ ఆర్మీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ టెక్నికల్ పోస్టులకు రాత పరీక్ష లేదు. బీటెక్ మార్కులను వడపోసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. రెండు దశల్లో...
జాబ్ కార్నర్
ఇండియన్ ఆర్మీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ టెక్నికల్ పోస్టులకు రాత పరీక్ష లేదు. బీటెక్ మార్కులను వడపోసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. రెండు దశల్లో, ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలో రాణించాలి. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. చదువుకున్న బ్రాంచీలో ఉద్యోగం చేయవచ్చు.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాలు శిక్షణ ఉంటుంది. ఇది 2026 ఏప్రిల్‌లో మొదలు అవుతుంది. శిక్షణ సమయంలో 56,100 స్టయిఫండ్ ఇస్తారు. ఆ తర్వాత ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్’ పేరుతో మద్రాస్ యూనివర్సిటీ డిగ్రీ ఇస్తుంది. శిక్షణ అనంతరం లెవెల్ 10లో లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీలోకి తీసుకుంటారు. అన్నీ కలుపుకుని తొలి నెల నుంచి దాదాపుగా 1.5 లక్షల జీతం వస్తుంది. ఎస్‌ఎ్‌ససీలో పదేళ్లు సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కొంత మందిని పర్మనెంట్ కమిషన్‌లోకి తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్ల సర్వీస్ పొడగింపు ఇస్తారు. వీరు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు.
ఖాళీల వివరాలు: మొత్తం 379 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పురుషులకు 350, మహిళలకు 29 ఉన్నాయి.(వీటిలో రెండు సైనిక వితంతువులకు కేటాయించారు). పురుషుల పోస్టులో విభాగాల వారీగా చూస్తే సివిల్ 75, కంప్యూటర్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలకా్ట్రనిక్స్ 64, మెకానికల్ 101, మిగతా బ్రాంచీల్లో 17 ఉన్నాయి, మహిళల పోస్టుల్లో సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ 4, ఎలక్ట్రికల్ 3, ఎలకా్ట్రనిక్స్6, మెకానికల్ 9 ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఫైనలియర్ చదివే విద్యార్థులు కూడా అర్హులే. వారు నిర్ణీత సమయంలో డిగ్రీని సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్ ఐటీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 20 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1999 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2006 మార్చి 31 తేదీలోపు జన్మించి ఉండాలి. సైన్య వితంతువుల వయస్సు 35 సంవత్సరాలు దాటి ఉండకూడదు.
చివరి తేదీ: 2025 ఆగస్ట్ 22 తేదీ
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News