Paneer: కల్తీ పన్నీర్‌ను కనిపెట్టేద్దాం!
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:10 AM
పన్నీర్ ఆరోగ్యకరం. క్యాల్షియం, విటమిన్ ఎ సమృద్ధిగా దొరికే పన్నీర్‌తో ఎముకలు దృఢపడతాయి. అయితే మార్కెట్లో మనకెన్నో రకాల పన్నీర్ అందుబాటులో ఉంటోంది. వాటిలో నకిలీ పన్నీర్ కూడా ఉంటుంది. దాన్నెలా గుర్తించాలో తెలుసుకుందాం!
ఇటీవలి కాలంలో వంటనూనెలతో కూడా పన్నీర్‌ను తయారు చేస్తున్నారు. అనలాగ్ పన్నీర్ అనే పేరుతో దొరుకుతున్న ఈ పన్నీర్‌లో పోషకాలు తక్కువ. అసలైన పన్నీర్ మృదువుగా, చిదిమితే విరిగిపోతూ, పాల వాసనను వెలువరిస్తూ ఉంటుంది. కానీ అనలాగ్ పన్నీర్, రబ్బరులా గట్టిగా ఉంటుంది. వేడిచేసినప్పుడు పాలతో తయారైన పన్నీర్ పాల కొవ్వును విడుదల చేస్తే, అదనపు నీళ్లను విడుదల చేస్తుంది. అలాగే ఈ నకిలీ పన్నీర్‌ను పరీక్షించడం కోసం, నీళ్లలో ఉడకబెట్టి, చల్లారిన తర్వాత కొన్ని చుక్కల అయొడిన్ టింక్చర్‌ను జోడించాలి. అప్పుడు పన్నీర్ నీలం రంగులోకి మారితే, దాన్లో స్టార్చ్ ఉందనీ, నకిలీదని అర్థం.
అలాగే పన్నీర్‌ను నీళ్లలో ఉడకబెట్టి, చల్లారిన తర్వాత దాని మీద కందిపప్పు పొడి లేదా సోయాబీన్ పొడి చల్లాలి. పది నిమిషాల తర్వాత అది లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పన్నీర్‌లో డిటర్జెంట్ లేదా యూరియా కలిసిందని అర్థం. మన దేశంలో అనలాగ్ పన్నీర్ విక్రయం చట్టబద్ధం. అయితే లేబుల్ మీద ‘నాన్ డైరీ’ అని స్పష్టంగా పేర్కొనాలి. కాబట్టి పన్నీర్ కొనేటప్పుడు ఆ అక్షరాల కోసం వెతకాలి. అనలాగ్ పన్నీర్ సింథటిక్ కాబట్టి దాంతో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుందనీ, జీర్ణకోశ సమస్యలు వేధిస్తాయనీ, ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఈ పన్నీర్‌తో గుండెజబ్బులు పెరుగుతాయనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..