Share News

Miss World 2025: భాగ్యనగరానికి అందాల సోయగాలు!

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:37 AM

ప్రపంచ సుందరి పోటీలను రత్‌లో నిర్వహించటం ఇది మూడవసారి. తెలుగు రాష్ట్రాలలో జరగటం ఇదే మొదటిసారి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటారు.

Miss World 2025: భాగ్యనగరానికి అందాల సోయగాలు!

ఈసారి ప్రపంచ సుందరి పోటీలకు భాగ్యనగరం వేదిక కానుంది. మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ అందాల పండుగపై అప్పుడే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రపంచ సుందరి పోటీలను రత్‌లో నిర్వహించటం ఇది మూడవసారి. తెలుగు రాష్ట్రాలలో జరగటం ఇదే మొదటిసారి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటారు. కాగా 1997లో హైదరాబాద్‌ అమ్మాయి డయానా డెన్‌ ఈ కిరీటాన్ని దక్కించుకుంది.

పోటీల ప్రస్థానం

ప్రపంచ సుందరి పోటీలు మొదటిసారి 1951లో ఇంగ్లండ్‌లో ప్రారంభమయ్యాయి. ఇంగ్లండ్‌కు చెందిన ‘ఎరిక్‌ మోర్లీ’ ఈ పోటీల సృష్టికర్త. 2000 సంవత్సరంలో ఎరిక్‌ మరణించిన తర్వాత ఆయన భార్య జులియా మోరీ ఈ పోటీలకు సారథ్యం వహిస్తున్నారు. స్వీడన్‌కు చెందిన మోడల్‌... కికి హకాన్సన్‌ 1951లో తొలి ప్రపంచ సుందరిగా ఎంపిక అయింది. మొదట్లో ఈ పోటీల పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఈ విమర్శలు ఈ అందాల పోటీల ఆదరణను ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. 1990వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మన దేశంలో కూడా ఈ పోటీల పట్ల పెరిగింది. 2000 సంవత్సరం తర్వాత ఈ పోటీలను కేవలం శారీరక సౌందర్యానికి మాత్రమే పరిమితం చేయకుండా మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నంగా చూపించటం మొదలుపెట్టారు. ఒక వ్యక్తికి ఉన్న సామాజిక బాధ్యతను గుర్తుచేసే విధంగా... ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అనే నినాదాన్ని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.


ఎలా ఎంపిక చేస్తారు?

ప్రతి ఏటా సుమారు 120 దేశాలలో ‘మిస్‌ వరల్డ్‌’ ప్రాథమిక అందాల పోటీలు జరుగుతాయి. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరందరూ సుమారు మూడు వారాలు జరిగే వేర్వేరు విభాగాల పోటీలలో పాల్గొనాల్సి ఉంటుంది. బీచ్‌ ఫ్యాషన్‌, బ్యూటీ విత్‌ పర్పస్‌, మల్టీ మీడియా, స్పోర్ట్స్‌, టాలెంట్‌, టాప్‌ మోడల్‌, కంటెస్టెంట్స్‌ ఛాయిస్‌ లాంటి అనేక విభాగాలు ఉంటాయి. ఈ విభాగాలలో విజేతలుగా నిలిచిన వారిని.. వేర్వేరు ఇంటర్వ్యూలలో గెలిచిన వారిని మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌ పోటీలకు పంపుతారు. వీరి సంఖ్య ఆ ఏడాది పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ తుది పోటీలలో న్యాయ నిర్ణేతలు తుది విజేతలను ఎంపిక చేస్తారు. తుది విజేతకు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌.. సుమారు 10 కోట్ల రూపాయల బహుమతి, వజ్రాల కిరీటంతో పాటు అనేక రకాల బహుమతులు దక్కుతాయి. ఈ బహుమతుల విలువ ప్రతి ఏడాది మారుతూ ఉంటుంది. ప్రపంచ సుందరిగా గెలిచినవారు... ఆ ఏడాది పొడవునా ప్రపంచ సుందరి సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో పర్యటిస్తారు. వీరిని అనేక బహుళ జాతి కంపెనీలు.. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా నియమించుకుం టాయి. ప్రపంచ సుందరి పోటీలలో గెలిచిన భామకు ఏడాది పాటు మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించే సంస్థ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. వారికి ఉచిత దుస్తులు, విమాన సౌకర్యం, హోటల్స్‌ సౌకర్యం, ఆభరణాల సౌకర్యం, మేకప్‌ సౌకర్యం, స్టైలింగ్‌ సౌకర్యం అందిస్తుంది.

ఆ ఆరుగురు వీరే

మన దేశం నుంచి ఆరుగురు అందగత్తెలు ప్రపంచ సుందరులుగా ఎంపికయ్యారు. వాళ్లెవరంటే...

  • రీటా ఫారియా (1966)

  • ఐశ్యర్యా రాయ్‌ (1994)

  • డయానా హెడెన్‌ (1997)

  • యుక్తా ముఖి (1999)

  • ప్రియాంక చోప్రా (2000)

  • మానుషి చిల్లర్‌ (2017)


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 04:40 AM