Storage Tips: ఇలా చేస్తే పురుగు పట్టదు!
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:51 AM
మనం ఇళ్లలో బియ్యం, పప్పులు తదితరాలను నిల్వ చేసుకుంటూ ఉంటాం. కొంతకాలం తరవాత వీటిలో పురుగులు చేరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పురుగు పట్టకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!
బియ్యంతోపాటు అన్ని రకాల పప్పుల్లో ఎక్కువగా ఎర్రని ముక్క పురుగులు పడుతుంటాయి. వీటిని నివారించడానికి బియ్యం, పప్పుల డబ్బాల్లో నాలుగు లవంగాలు వేసి ఉంచాలి. లవంగాల ఘాటుకి పురుగులు చేరవు.
బియ్యానికి, రవ్వలకూ తెల్లని పొడవాటి పురుగులు పడుతుంటాయి. ఆ డబ్బాల్లో బిరియానీ ఆకులు లేదా మిరియాలు వేసి ఉంచితే వాటి వాసనకు పురుగులు చనిపోతాయి.
ధాన్యం బస్తాల్లో కొన్ని ఎండు మిరపకాయలు కలిపితే ఎటువంటి పురుగులూ చేరవు.
వేరుశనగ గుండ్లు, కంది పప్పు, పెసర పప్పు, మినప గుండ్లు నిల్వ చేసిన డబ్బాల్లో రెండు ఎండిన పసుపు కొమ్ము ముక్కలు వేసి ఉంచితే పురుగు పట్టదు.
కారం డబ్బాలో ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తే పురుగు రాదు
గోధుమల డబ్బాలో గుప్పెడు ఎండిన వేపాకులు వేసి ఉంచితే మంచి ప్రయోజనం ఉంటుంది.
పుట్నాలు, శనగలు, పెసలు, బఠానీల డబ్బాల్లో రెండు చెంచాల కల్లుప్పు కలిపితే వాటికి ఎటువంటి పురుగులూ పట్టవు.
మిరియాలను కచ్చా పచ్చాగా నలగగొట్టి, ఒక చిన్న గుడ్డలో మూట కట్టి వంట గదిలోని అరల్లో ఉంచితే పురుగులు దరి చేరవు.
ఒకటి లేదా రెండు అగ్గిపెట్టెలను మూత తీసి వంటగది అరల్లో మూలగా పెట్టినా ఫలితం కనిపిస్తుంది. అగ్గిపుల్లలకు ఉండే మందులో సల్ఫర్ ఉంటుంది. దీని ఘాటుకు పురుగులు చనిపోతాయి.
బియ్యం, పప్పులు, పిండి, రవ్వ... ఇలా అన్నిటినీ గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేసుకుంటే పురుగుల సమస్య రాదు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News