Share News

How to Relieve Bloating Naturally: కడుపుబ్బరం వదలాలంటే

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:16 AM

కొన్ని ఆహార పదార్థాల మూలంగానే ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి మందుల మీద ఆధారపడకుండా కారణాలను కనిపెట్టాలి. అవసరమైన చిట్కాలు పాటించాలి...

How to Relieve Bloating Naturally: కడుపుబ్బరం వదలాలంటే

గుడ్‌ హెల్త్‌

కొన్ని ఆహార పదార్థాల మూలంగానే ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి మందుల మీద ఆధారపడకుండా కారణాలను కనిపెట్టాలి. అవసరమైన చిట్కాలు పాటించాలి.

  • పప్పు దినుసులు: వీటిలో గ్యాలెక్టోలిగోశాక్రైడ్స్‌, ఫ్రక్టేన్స్‌ అనే శోషణ చెందని పిండి పదార్థాలుంటాయి. ఇవి పేగుల్లోని బ్యాక్టీరియాతో కలిసి, పులుస్తాయి. దాంతో వాయువులు వెలువడి, కడుపు ఉబ్బరం మొదలవుతుంది.

  • కొన్ని కూరగాయలు, పండ్లు: కాలీఫ్లవర్‌, క్యాబేజీ, క్యారెట్‌లలో స్టార్చ్‌ ఎక్కువ. అలాగే అప్రికాట్‌, ప్రూన్స్‌లో చక్కెరలు ఎక్కువ. ఇవన్నీ బ్లోటింగ్‌కు దారి తీస్తాయి.

  • పాల ఉత్పత్తులు: ల్యాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ ఉన్నవాళ్లు పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరం మొదలవుతుంది.

  • స్వీటెనర్లు: కొందరు పదార్థాల నిల్వకు ఉపయోగించే ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేసుకోలేరు. కృత్రిమ తీపి పదార్థాలలో ఉండే సార్బిటాల్‌ అనే రసాయనం తేలికగా జీర్ణం కాదు. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి.

ఉపశమనం ఇలా

  • కామొమైల్‌ ఆయిల్‌: ఈ నూనె పొట్టలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ నూనెను పొట్ట మీద రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

  • జీలకర్ర ఆయిల్‌: ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ లాంటి సమస్యలకు ఈ నూనె చక్కని విరుగుడు. కాబట్టి ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు ఈ నూనెతో పొట్టను మర్దన చేయాలి.

  • అల్లం నూనె: వాయువులు పేగుల గుండా బయటకు వెళ్లిపోడానికి ఈ నూనె తోడ్పడుతుంది. ఈ నూనెను పరగడుపున తీసుకోవాలి

  • పెప్పర్‌మింట్‌ ఆయిల్‌: దీన్లోని యూజెనాల్‌, థైమాల్‌ పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పేగుల్లో ఆహారం పులిసే ప్రక్రియకు అడ్డు పడతాయి. సమస్య తలెత్తినప్పుడు ఈ నూనెను తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 01:17 AM