Share News

ఇలా చేస్తే చర్మ రంధ్రాలు కనిపించవు

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:44 AM

చర్మం మీద సహజంగా స్వేద గ్రంథులు అనే సన్నని రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే చెమట, జిడ్డు లాంటి మలినాలను చర్మం బయటికి పంపిస్తుంది. కొంతమందిలో ఈ రంధ్రాలు కొద్దిగా...

ఇలా చేస్తే చర్మ రంధ్రాలు కనిపించవు

చర్మం మీద సహజంగా స్వేద గ్రంథులు అనే సన్నని రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే చెమట, జిడ్డు లాంటి మలినాలను చర్మం బయటికి పంపిస్తుంది. కొంతమందిలో ఈ రంధ్రాలు కొద్దిగా పెద్దవిగా తెరచుకుని ఉంటాయి. ముఖ్యంగా ముఖం మీద. వీటివల్ల ముఖం నునుపుగా మెరవదు. వీటిలో మురికి, దుమ్ము లాంటివి చేరి మొటిమలు, గుల్లలు ఏర్పడుతుంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారిని ఈ సమస్య అధికంగా వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో ఈ రంధ్రాలను శుభ్రం చేసి దగ్గరకు ముడుచుకునేలా చేయవచ్చు.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జు, మూడు చెంచాల కీరా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలితో ముఖమంతా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తరవాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే చర్మ రంధ్రాలు పూర్తిగా శుభ్రమవుతాయి. తగినంత తేమ అంది చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో చర్మ రంధ్రాలు కుంచించుకుంటాయి.

  • గిన్నెలో రెండు చెంచాల ఓట్స్‌, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖాన్ని పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత వేళ్లతో గుండ్రంగా రుద్దుతూ మర్ధన చేస్తే చర్మం మీద పేరుకున్న మృత కణాలు, రంధ్రాల్లో చేరిన మురికి తొలగిపోతాయి. గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే ముఖం పూర్తిగా శుభ్రపడుతుంది. పెరుగులోని లాక్టిక్‌ ఆమ్లం చర్మ రంధ్రాలు మూసుకునేలా చేస్తుంది. దీంతో చర్మం నునుపుగా కనిపిస్తుంది.


  • ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీ మట్టిని తీసుకుని దానికి మూడు చెంచాల గులాబీ నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తరవాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. చర్మం నున్నగా మెరుస్తుంది. బాగా పండిన టమాటాలను గుజ్జులా చేసి ముఖానికి ప్యాక్‌ వేయాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే రంధ్రాలు అసలు కనిపించవు.

  • ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన, ఒక చెంచా నిమ్మరసం వేసి నురుగు వచ్చేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌ సహాయంతో ముఖమంతా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం బిగుతుగా మారుతుంది. రంధ్రాలు కూడా సన్నగా మారతాయి.

ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 05:08 PM