kumkum: ఇంట్లోనే కుంకుమ తయారీ ఇలా...
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:19 AM
కొంతమంది పాపిడి మధ్యలో సిందూరం దిద్దుకుంటారు. బజార్లో కొనుక్కున్న కుంకుమ వల్ల ఒక్కోసారి చర్మం మీద నల్లని మచ్చలు, కురుపులు ఏర్పడుతుంటాయి.
మహిళలు రోజూ నుదిటిమీద కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పాపిడి మధ్యలో సిందూరం దిద్దుకుంటారు. బజార్లో కొనుక్కున్న కుంకుమ వల్ల ఒక్కోసారి చర్మం మీద నల్లని మచ్చలు, కురుపులు ఏర్పడుతుంటాయి. అలాకాకుండా ఇంట్లోనే ఎర్రని కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం!
కుంకుమ తయారీ
ముందుగా మిక్సీ గిన్నెల్లో చిన్నదాన్ని తీసుకొని లోపల నీళ్ల చుక్కలు లేకుండా శుభ్రంగా తుడవాలి. అందులో నాలుగు చెంచాల పసుపు పొడి, ఒక చెంచా నెయ్యి వేసి రెండూ కలిసేలా చెంచాతో కలపాలి. తరవాత ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు సున్నం వేసి కలపాలి. ఒక చెంచా గులాబీ నీళ్లు కూడా వేసి ఉండలు రాకుండా కలపాలి. ఈ గిన్నెను గ్రైండర్‌కు అమర్చి ఒక నిమిషం గ్రైండ్ చేయాలి. మిక్సీ గిన్నెలో ఎర్రని కుంకుమ తయారవుతుంది. దాన్ని ఒక పళ్లెంలోకి తీసి అరగంటసేపు ఆరనివ్వాలి. తరవాత అందమైన కుంకుమ భరిణెలో దాన్ని నిల్వ చేసుకోవచ్చు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు