Share News

Nutrition Advice: రోజుకు ఎన్నిసార్లు తినాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:16 AM

సాధారణంగా రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకుంటాం. అయితే కొందరు అంతకంటే ఎక్కువసార్లు తింటారు. ఇలా చేయడం వలన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో, వైద్యులు...

Nutrition Advice: రోజుకు ఎన్నిసార్లు తినాలి

తెలుసుకుందాం

సాధారణంగా రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకుంటాం. అయితే కొందరు అంతకంటే ఎక్కువసార్లు తింటారు. ఇలా చేయడం వలన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో, వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

రోజులో మూడు కంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మనం ఏం తింటున్నాం?, ఎంత మోతాదులో తింటున్నాం? అన్న దాని మీదే శరీరానికి లాభమా? నష్టమా? అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. శరీరానికి సమతుల్య పోషకాహారం అవ సరం. కొద్ది, కొద్దిగా ఎక్కువసార్లు తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేగ రోగులకు, ఇన్సులిన్‌ సెన్సిటివిటీ ఉన్నవారికి దీని వలన ప్రయోజనం చేకూరుతుందని లక్డీకాపూల్‌లోని గ్లెనీగేల్స్‌ హాస్పిటల్‌ చీఫ్‌ డైటీషియన్‌, డాక్టర్‌ పి భావన తెలిపారు. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు సిరంగా ఉంటాయనీ, ఇలా కొద్ది కొద్దిగా తినడం వలన జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుందనీ అంటున్నారు. ఛాతీ మంట, జీర్ణకోశ సమస్యలతో బాధపడే వారికి దీనిని సిఫారసు చేస్తారని కూడా ఆమె చెప్పారు. ఇలా తినవడం వలన రోజంతా శక్తి సమకూరే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువసార్లు తినడం వలన నష్టాలు కూడా లేకపోలేదు. తరచూ తినడం వల్ల సహజంగా కలిగే ఆకలి సంకేతాలకు భంగం కలుగుతుందని ముంబైలోని గ్లెనీగల్స్‌ హాస్పిటల్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, డాక్టర్‌ మంజూష అగర్వాల్‌ పేర్కొన్నారు.


ఆహారం జీర్ణమవడానికి సరిపడా సమయం ఉండకపోవడం, ఎక్కువ మొత్తంలో తింటూ ఉండడం, క్యాలరీలు, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వలన అధిక బరువు సమస్య పొంచి ఉంటుందని ఆమె హెచ్చరించారు. అలాగే ఎక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుందని, గ్యాస్‌, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అలాగే మెటబాలిక్‌ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలిందని డాక్టర్‌ మంజూష అగర్వాల్‌ వెల్లడించారు. అయితే భోజనానికి, భోజనానికి మధ్య ఎంత సమయం అవసరం అన్నది వ్యక్తుల జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 01:16 AM