Share News

Robotic Assisted Surgery: తుంటి కీలు మార్పిడి ఇక సులభతరం

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:52 AM

తుంటి కీలు మార్పిడి అంతకంతకూ సులభతరమవుతోంది. తాజాగా ‘డైరెక్ట్‌ యాంటీరియర్‌ అప్రోచ్‌’ అనే అత్యాధునిక శస్త్రచికిత్సా విధానమొకటి అందుబాటులోకొచ్చింది. పూర్తి తుంటి కీలును మార్చే ఈ రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ...

Robotic Assisted Surgery: తుంటి కీలు మార్పిడి ఇక సులభతరం

రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ

తుంటి కీలు మార్పిడి అంతకంతకూ సులభతరమవుతోంది. తాజాగా ‘డైరెక్ట్‌ యాంటీరియర్‌ అప్రోచ్‌’ అనే అత్యాధునిక శస్త్రచికిత్సా విధానమొకటి అందుబాటులోకొచ్చింది. పూర్తి తుంటి కీలును మార్చే ఈ రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ, అన్నివిధాలా సురక్షితమైనదని వైద్యులు అంటున్నారు.

శరీరం ముందు వైపు నుంచి తుంటిని చేరుకుని, కీలును మార్చే సర్జరీ, డైరెక్ట్‌ యాంటీరియర్‌ అప్రోచ్‌. చిన్నపాటి కోతతో, కచ్చితమైన రోబోటిక్‌ సాంకేతికతతో సాగే ఈ శస్త్రచికిత్సలో భాగంగా వైద్యుల కండరాల మధ్య నుంచి తుంటిని చేరుకుంటారు కాబట్టి కండరాలు, మృదుకణజాలలకు నష్టం జరగకుండా ఉంటుంది.


కచ్చితత్వంతో కూడిన శస్త్రచికిత్స

సిటి స్కాన్స్‌ ఆధారంగా రోగికి సంబంధించిన ఒక త్రిడి మోడల్‌ను రూపొందించుకుని, వైద్యులు రోబోటిక్‌ అసిస్టెన్స్‌ సహాయంతో, సర్జరీకి పూనుకుంటారు. సర్జరీ కంటే ఎంతో ముందుగానే పూర్తి శస్త్రచికిత్సను వైద్యులు ప్రణాళికాబద్ధంగా అంచనా వేసుకుంటారు. దాంతో ఇంప్లాంట్‌ పరిమాణం, దాన్ని అమర్చే ప్రదేశాల గురించిన కచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోగలుగుతారు. అలాగే రోబోట్‌ వ్యవస్థ, ఎప్పటికప్పుడు అందించే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వైద్యులు చికిత్స మీద నియంత్రణను పెంచుకుంటూ, సమర్థమైన ఫలితాన్ని రాబట్టేలా, ఎలాంటి దుష్ప్రభావాలకూ తావు లేని కచ్చితత్వంతో కూడిన చికిత్సను అందించగలుగుతారు.

చిన్న కోత ద్వారా...

ఈ శస్త్రచికిత్స చిన్న కోతతోనే పూర్తయిపోతుంది. కాబట్టి సర్జరీ తదనంతర నొప్పి ఎంతో తక్కువగా ఉంటుంది. అలాగే సర్జరీ నుంచి వేగంగా కోలుకోగలుగలుగుతారు. ఈ ప్రయోజనాలకు తోడు సర్జరీలో ఉపయోగించిన ఇంప్లాంట్‌ ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. కండరాల కోత ఉండదు కాబట్టి సర్జరీ తర్వాత రోగులు అన్ని రకాల పనులూ చేసుకోగలుగుతారు.

డాక్టర్‌ కృష్ణ కిరణ్‌ ఈచెంపాటి

హిప్‌ అండ్‌ నీ రీప్లే్‌సమెంట్‌ అండ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 04:52 AM