Parenting: యుక్తవయసు పిల్లలకు ఇవి చెప్పండి..!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:24 AM
పిల్లలకు యుక్తవయసులో సొంత ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. తల్లిదండ్రులు వాటిని గౌరవిస్తూనే తగిన మార్గనిర్దేశనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు ఏ అంశాలు ఎలా వివరించాలో తెలుసుకుందాం.

మానసిక ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు వివరించి చెప్పాలి. భావోద్వేగాల నియంత్రణతోపాటు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకునే మార్గాలు తెలియజేయాలి.
ఆన్‌లైన్ మోసాలను వివరించాలి. సామాజిక మాధ్యమాల్లో జాగరూకతతో వ్యవహరించమని చెప్పాలి.
సంబంధ బాంధవ్యాలు, గౌరవం, భావ వ్యక్తీకరణ గురించి యుక్తవయసు పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించాలి.
డ్రగ్స్, మద్యం, సిగరెట్ లాంటి అలవాట్ల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వాటికి దూరంగా ఉండమని చెప్పాలి. స్నేహితుల నుంచి ఈ అలవాట్లు చేసుకోకుండా అవగాహన కల్పించాలి.
పిల్లల అభిరుచులను ప్రోత్సహించాలి. తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొమ్మని చెప్పాలి.
చదువు వల్ల ఒత్తిడికి గురికాకుండా ఇష్టంగా చదువుకునే విధానాలను చర్చించాలి. పరీక్షల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించాలి. ఈర్ష్య, అసూయలకు తావు లేకుండా స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పాలి.
డబ్బు విలువ తెలియజెప్పాలి. ఖర్చు చేసే విధానం, పొదుపు మార్గాలను వివరించాలి.
ఓటమి ఎదురైనప్పుడు నిరాశ పడకుండా ధైర్యంగా ముందుకు సాగే విధానాన్ని వివరించాలి.
ప్రేమ పేరుతో జరిగే మోసాలను వివరించి చెప్పాలి.
వ్యక్తిగత శ్రద్దతోపాటు తోటివారితో స్నేహంగా మెలగడం, దయతో ప్రవర్తించడం, అవసరమైనవారికి సహాయ సహకారాలు అందించడం లాంటివి ప్రత్యేక గౌరవాన్ని అందిస్తాయని చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.