Share News

Children Immunity Boosting Foods: పిల్లల వ్యాధినిరోధక శక్తి పెరిగేలా

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:15 AM

తల్లులు పిల్లలకు అందించే ఆహారం పట్ల అవగాహనతో మెలగడం చాలా అవసరం....

Children Immunity Boosting Foods: పిల్లల వ్యాధినిరోధక శక్తి పెరిగేలా

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! పిల్లల వ్యాధినిరోధక శక్తిని పెంచడం కోసం ఎలాంటి ఆహారాన్ని అందించాలి? అందుకోసం ఏయే పదార్థాలు, వంటకాలను ఎంచుకోవాలో సూచించండి

- ఓ సోదరి, వరంగల్‌.

తల్లులు పిల్లలకు అందించే ఆహారం పట్ల అవగాహనతో మెలగడం చాలా అవసరం.

  • ఇంట్లో వండిన తాజా ఆహారం: పిల్లలను బడికి పంపించే హడావుడిలో నూడుల్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌ లాంటి రెడీమేడ్‌ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ, దోశ, కిచిడి లాంటి బలవర్ధక పోషకాహారం అల్పాహారంగా ఇవ్వాలి.

  • జంక్‌ ఫుడ్‌: బిస్కెట్లు, చిప్స్‌, బ్రెడ్‌ లాంటి స్నాక్స్‌కు బదులుగా తాజా పళ్ల ముక్కలు, కూరగాయ ముక్కలు, డ్రై ఫ్రూట్స్‌ కలిపి ఇవ్వాలి.

  • కూరగాయలు: భోజనంలో కనీసం రెండు, మూడు రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బఠాణీ, బ్రొకొలి, తీపి మొక్కజొన్న, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, క్యాప్సికం... ఇలా భిన్న కూరగాయలను కలిపి కూరగా వండి, వడ్డించాలి.

  • ప్రొటీన్‌ ఎక్కువగా: ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినిపించవచ్చు. రోజు మొత్తంలో ఒక గ్లాసు పాలు ఇవ్వవచ్చు. చికెన్‌, చేపలు తగుమాత్రంగా ఇవ్వవచ్చు. సోయాలో కూడా ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. పప్పుదినుసులతో కూడిన కిచిడి, జీడిపప్పు వేసిన బొంబాయి రవ్వ ఉప్మాతో కూడా ప్రొటీన్‌ అందుతుంది.

  • రెండు పళ్లు: రోజు మొత్తంలో కనీసం రెండు రకాల పళ్లు పిల్లలు తినేలా చూసుకోవాలి. యాపిల్స్‌, కివి, డ్రాగన్‌ ఫ్రూట్‌ లాంటి ఖరీదైన పళ్లనే ఎంచుకోవలసిన అవసరం లేదు. పిల్లలు ఇష్టపడే అరటిపండు, జామ పండు ద్వారా కూడా సరిపడా పోషకాలు అందుతాయి.

  • డ్రైఫ్రూట్స్‌: రోజు మొత్తంలో కనీసం రెండు, మూడు రకాల డ్రై ఫ్రూట్స్‌ తినేలా చూసుకోవాలి. ఒకటి రెండు వాల్‌నట్స్‌, రెండు, మూడు బాదం, నాలుగైదు జీడిపప్పులు పిల్లలకు అందించాలి. వీటిని పొడిచేసి, స్నాక్స్‌లో కలిపి ఇవ్వవచ్చు. వేరుసెనగపప్పు కూడా మంచిదే! వీటన్నిటినీ కలిపి డ్రై ఫ్రూట్‌ లడ్డు తయారుచేసి, అందించవచ్చు.

  • స్నాక్స్‌: పిల్లలతో పాటు బడికి పంపించే స్నాక్స్‌గా డ్రై ఫ్రూట్‌ పాయసం, ఫ్రూట్‌ సలాడ్‌, పళ్లముక్కలు ఇవ్వవచ్చు.

    డాక్టర్‌ సత్యన్నారాయణ కావలి ఎమ్‌డి పీడియాట్రిక్స్‌,

సీనియర్‌ కన్సల్టెంట్‌, హైదరాబాద్‌.

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 18 , 2025 | 04:15 AM