Share News

Health Benefits: ఆరోగ్యానికి లవంగ నేరేడు

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:07 AM

నేరేడు పళ్లు ఆరోగ్యానికి మంచివని చాలా మందికి తెలుసు. అయితే నేరేడులో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి లవంగ నేరేడు. దక్షిణ భారతదేశంలో పెరిగే ఈ మొక్క పళ్లతో పాటు ఆకుల వలన కూడా ఎన్నో...

Health Benefits: ఆరోగ్యానికి లవంగ నేరేడు

నేరేడు పళ్లు ఆరోగ్యానికి మంచివని చాలా మందికి తెలుసు. అయితే నేరేడులో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి లవంగ నేరేడు. దక్షిణ భారతదేశంలో పెరిగే ఈ మొక్క పళ్లతో పాటు ఆకుల వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం..

లవంగ నేరేడును వైల్డ్‌ బ్లాక్‌ ప్లమ్‌ అని కూడా అంటారు. ఈ మొక్క దక్షిణ భారతదేశంలో కొండ, అటవీ ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది సాధారణంగా 5-10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్కకు లేత గులాబీ రంగు పువ్వులు పూస్తాయి. అవి సువాసన వెదజల్లుతాయి. ఈ పువ్వుల నుంచి చిన్న గుండ్రని పళ్లు కాస్తాయి. ఈ కాయలలో ఒకే విత్తనం ఉంటుంది. ఈ పళ్లు కొంచెం తీయగా, పుల్లగా ఉంటాయి. వీటిని నేరుగా తింటారు. అలాగే జామ్‌, జ్యూస్‌ తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు, బెరడును సంప్రదాయ వైద్యంలో వాడతారు. మధుమేహం, విరేచనాలు, గాయాల చికిత్సకు వినియోగిస్తారు. ఈ ఆకులు, బెరడులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

డాక్టర్‌ శ్రీనాథ్‌

వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి

హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

Updated Date - Sep 01 , 2025 | 02:07 AM