Mahabilvam Medicinal Uses: ఔషధాల మహాబిల్వం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:36 AM
శివుడిని ఎంతో పీతిపాత్రమైనవిగా బిల్వపత్రాలు అందరికీ తెలిసిందే. అయితే మహాబిల్వం మొక్కలో కూడా పలు ఔషధ గుణాలు దాగున్నాయని తెలుసా! ఆ వివరాలు తెలుసుకుందాం...
శివుడిని ఎంతో పీతిపాత్రమైనవిగా బిల్వపత్రాలు అందరికీ తెలిసిందే. అయితే మహాబిల్వం మొక్కలో కూడా పలు ఔషధ గుణాలు దాగున్నాయని తెలుసా! ఆ వివరాలు తెలుసుకుందాం..
మహాబిల్వాన్ని వేయి కన్నుల చెట్టు అని పిలుస్తారు. దీని ఆకులను శివునికి సమర్పిస్తారు. ఈ చెట్టు భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో పెరుగుతుంది. కరువు ప్రాంతాల్లోనూ మనగలగడం దీని ప్రత్యేకత. మహాబిల్వం మొక్క గుబురుగా 2 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు చిన్నగా ఉంటాయి. ఈ మొక్కకు వేసవిలో తెల్లని పువ్వులు పూస్తాయి. వీటి నుంచి గుండ్రని కాయలు కాస్తాయి. ఈ కాయలు పండే క్ర మంలో నారింజ పసుపు రంగులోకి మారతాయి. మహాబిల్వం ఆకులు, కాయలు, బెరడును సంప్రదాయ వైద్యంలో జీర్ణ సమస్యలు, జ్వరం, చర్మ వ్యాధులను తగ్గించేందుకు వాడతారు. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో కూడా వినియోగిస్తారు. ఈ మొక్క బెరడు, ఆకులు, కాయలను మూలికల తయారీలోనూ ఉపయోగిస్తారు. బిల్వ పత్రాలను రుబ్బి పాలలో కలుపుకుని తాగితే మూర్చరోగం, జీర్ణ, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క కాయలను క్రిమికీటకాలను పారదోలేందుకు, బెరడును బెణికిన నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు వాడతారు.
డాక్టర్ శ్రీనాథ్,
వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News