Share News

ఐస్‌క్రీమ్‌ తింటే

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:24 AM

చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారు ఉండరు. కొంతమంది మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనో, మధుమేహం వస్తుందనో ఐస్‌క్రీమ్‌ తినడం...

ఐస్‌క్రీమ్‌ తింటే

చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారు ఉండరు. కొంతమంది మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనో, మధుమేహం వస్తుందనో ఐస్‌క్రీమ్‌ తినడం మానేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేక సందర్భాల్లో మితంగా ఐస్‌క్రీమ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఐస్‌క్రీమ్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

  • పాలు, క్రీమ్‌, చక్కెర కలిపి తయారుచేసే ఐస్‌క్రీమ్‌లో ఎ విటమిన్‌, కొలిన్‌ అధికంగా ఉంటాయి. వీటివల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. శరీరానికి కాల్షియం, జింక్‌, పొటాషియం, అయొడిన్‌, మెగ్నీషియం, పాస్పర్‌సలాంటి పోషకాలు; బి, డి, ఇ విటమిన్లతోపాటు ప్రోటీన్లు కూడా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

  • భోజనం తరవాత ఐస్‌క్రీమ్‌ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు, దంతాలు, చిగుళ్లు బలపడతాయి. తగినంత తేమ అంది చర్మం మృదువుగా మారుతుంది. నిర్జలీకరణ సమస్యలు రావు.

  • ఐస్‌క్రీమ్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఐస్‌క్రీమ్‌ తిన్నప్పుడు దానిలోని చక్కెర వేగంగా రక్తంలోకి చేరలేదు. శరీరం బరువు పెరగదు.

  • ఐస్‌క్రీమ్‌ తినడం వల్ల ఒత్తిడి, చిరాకు, అసహనం తొలగి మానసిక ఆనందం కలుగుతుంది. ఇది మంచి ప్రో బయోటిక్‌ పదార్థం. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఐస్‌క్రీమ్‌ తిన్న వెంటనే నీరసం, నిస్సత్తువ తగ్గి చురుకుగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి..

కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 04:24 AM