Coffee Benefits: విషాల్ని హరించే కాఫీ
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:07 AM
కాఫీతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వాటిని పొందాలంటే కాఫీ తాగడానికి కచ్చితమైన పద్ధతిని అనుసరించాలి. అదెలాగంటే....
కాఫీని సరైన మోతాదులో తీసుకుంటే శరీరంలోని విషాలు హరిస్తాయి. దాంతో కాలేయ పనితీరు మెరుగు పడుతుంది. కాఫీ గింజల్లోని క్లోరోజెనిక్ యాసిడ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీర్యాడికల్స్‌ను స్థిరీకరిస్తాయి. దాంతో మూత్రపిండాల పనితీరు మెరుగై, మూత్రం ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే సరైన కాఫీ దినుసులను, సరైన విధానంలో వాడుకుని, సరైన సమాయాల్లో, సరైన మోతాదుల్లో కాఫీ తయారుచేసుకుని తాగాలి. అందుకోసం, పురుగు మందులు ఉపయోగించకుండా పండించిన, సేంద్రీయ కాఫీ విత్తనాలను వాడుకోవాలి. అలాగే డికాక్షన్‌కు చక్కెర జోడించకూడదు.
బ్లాక్ కాఫీ లేదా దాల్చిన చెక్క జోడించిన కాఫీ తాగాలి. నచ్చినవాళ్లు ఆరోగ్యకరమైన కొబ్బరి నూనె, లేదా వెన్నలను కాఫీకి జోడించి బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగొచ్చు. రాత్రిపూట కాఫీ తాగితే విషాలు హరించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య సమయం కాఫీకి అనువైన సమయం. కానీ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు కాఫీ తాగకూడదు. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగితే, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరుగుతుంది. వ్యాయామంతో శరీరం చురుగ్గా మారడం వల్ల విషాలు శరీరంలో నుంచి సునాయాసంగా బయటకు వెళ్లిపోతాయి. అయితే కాఫీ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలంటే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకే పరిమితం కావాలి.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..