బ్రొకలీతో ఆరోగ్యం
ABN , Publish Date - Jul 03 , 2025 | 02:49 AM
క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వండుకుని లేదా పచ్చిగా తిన్నా మంచిదంటున్నారు...
క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వండుకుని లేదా పచ్చిగా తిన్నా మంచిదంటున్నారు నిపుణులు.
బ్రొకలీలో విటమిన్ కె, క్యాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయ పడతాయి.
ఇందులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించి బరువు పెరగకుండా సహాయ పడుతుంది.
విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుం ది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటి్‌సకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి.
బ్రొకలిలోని యాంటీఆక్సిడెంట్లు హానికర ఫ్రీరాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.
ఇందులోని విటమిన్ సి, ఈ, ఫ్లేవనాయిడ్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బ్రొకలి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
అయితే ఇది థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ ఉన్నవారు బ్రొకలీకి దూరంగా ఉండడం మేలు.
ఇవి కూడా చదవండి..
క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి