Share News

Islamic Teachings: ఆరోగ్య భాగ్యం

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:18 AM

‘‘దైవం మనకు ఇచ్చిన రెండు వరాల విషయంలో మానవులు చాలా నిర్లక్ష్యం వహిస్తారు. మొదటిది... మంచి ఆరోగ్యం. రెండోది... తీరిక’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ చెప్పారు. మనలో చాలామంది ఆరోగ్యాన్ని...

Islamic Teachings: ఆరోగ్య భాగ్యం

సందేశం

‘‘దైవం మనకు ఇచ్చిన రెండు వరాల విషయంలో మానవులు చాలా నిర్లక్ష్యం వహిస్తారు. మొదటిది... మంచి ఆరోగ్యం. రెండోది... తీరిక’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ చెప్పారు. మనలో చాలామంది ఆరోగ్యాన్ని పట్టించుకోరు. విశ్వాసి ఎప్పుడూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని, అల్లాహ్‌కు బలహీనుడైన విశ్వాసి కన్నా బలమైన విశ్వాసినే ఇష్టపడతాడని ఒక హదీసు (ప్రవక్త సూక్తి) చెబుతోంది. ‘‘కృతజ్ఞత తెలిపే నాలుక, స్మరించే హృదయం, కష్టపడే శరీరం, మంచి గుణం కలిగిన జీవిత భాగస్వామి... ఎవరికైతే ఇవి ఉన్నాయో... వారికి ప్రపంచంలోని వరాలన్నీ లభించినట్టే’’ అని మహనీయుడైన హజ్రత్‌ ఆలీ ఒక సందర్భంలో చెప్పారు. వాటితోపాటు ఆరోగ్యం కూడా గొప్ప వరం.

ఆరోగ్యం బాగుంటే ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా, శ్రద్ధగా దైవారాధన చేసుకోవచ్చు. ఇతరులకు సహాయపడవచ్చు. ఆహారం తీసుకోవడంలో హెచ్చుతగ్గులు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఎక్కువగా తినడం మంచిదికాదని, దాన్ని నివారించుకోవాలనీ పలు హదీసులు చెప్పాయి. మనిషి ఆరోగ్యంగా, బలంగా ఉంటే అన్ని పనులు స్వయంగా చేయగలడు, సత్కార్యాలు ఆచరించగలడు. చక్కగా ప్రార్థనలు, ఉపవాసాలు, దానధర్మాలు చేయగలడు. ఇతరులకు ఏదైనా అవసరాలు కలిగితే వాటిని తీర్చగలడు, వారి పనులలో సహాయపడగలడు. దివ్యఖుర్‌ఆన్‌ పారాయణ, దైవస్మరణ చేయగలడు. కానీ మనిషి అనారోగ్యానికి గురైతే బలహీనపడతాడు. శరీరాన్ని నిస్సత్తువ ఆవహిస్తుంది. చురుకుగా తిరిగే సామర్థ్యం ఉండదు. చివరకు తన పని తాను చేసుకోవడానికి కూడా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్బంలో అతను స్వయంగా ఏ సత్కార్యం చెయ్యలేడు. నమాజ్‌ చేయలేడు. ఉపవనాసాలు పాటించలేడు. వేరొకరికి సాయపడలేడు. అందుకే ఆరోగ్యం విషయంలో అందరం జాగ్రత్త వహించాలి. చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదు. సరైన అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి సాధారణంగా అనారోగ్యానికి దారి తీస్తాయి. అందుకే అనారోగ్యానికి ముందు ఉన్న ఆరోగ్యాన్ని మహా భాగ్యంగా భావించాలని దైవ ప్రవక్త మహమ్మద్‌ సూచించారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 05:18 AM