Share News

Balcony Gardening Tips: బాల్కనీలో తోట పెంచుదాం

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:29 AM

చిన్న చిన్న పూల మొక్కలే కాదు ఆకు కూరలు, కూరగాయల మొక్కలను కూడా బాల్కనీలో పెంచవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఉన్న కొద్ది స్థలంలోనే పలు రకాల మొక్కలతో కూడిన తోటను ఎలా పెంచాలో...

Balcony Gardening Tips: బాల్కనీలో తోట పెంచుదాం

చిన్న చిన్న పూల మొక్కలే కాదు ఆకు కూరలు, కూరగాయల మొక్కలను కూడా బాల్కనీలో పెంచవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఉన్న కొద్ది స్థలంలోనే పలు రకాల మొక్కలతో కూడిన తోటను ఎలా పెంచాలో తెలుసుకుందాం...

  • ముందుగా ఏయే మొక్కలు పెంచాలను కుంటున్నారో ఒక జాబితా రాయాలి. ఏ మొక్కలకు ఎండ అవసరమో, వేటికి అవసరం లేదో తెలుసుకోవాలి. బాల్కనీలో ఏ ప్రదేశంలో ఎండ ఎక్కువగా ఉంటుందో పరిశీలించాలి. అసలు ఎండ రాని చోటుని కూడా గుర్తించాలి. అలాగే ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఎంతసేపు ఎండ నిలుస్తుందో గమనించాలి.

  • ఎండ బాగా తగిలే చోట టమాటా, వంకాయ, పచ్చి మిర్చి మొక్కల కుండీలు పెట్టాలి. మరీ ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు ఎండ నిలిచే చోట పుదీనా, కొత్తిమీర, మెంతి కూర మొక్కల కుండీలు అమర్చాలి. అలాగే పూల మొక్కలకు కూడా కొద్దిసేపు ఎండ తగిలేలా చూసుకోవాలి.

  • బాల్కనీలో గోడవారగా ఐరన్‌ స్టాండ్‌లు పెట్టి వాటిలో గ్రోబ్యాగ్స్‌ ఏర్పాటు చేసుకుని కూరగాయల మొక్కలు పెంచవచ్చు. అలాగే వివిధ సైజుల్లో లభ్యమయ్యే ట్రేలలో ఆకుకూరల మొక్కలు నాటవచ్చు. తీగజాతి కూరగాయల మొక్కలను బాల్కనీ గ్రిల్‌కి అల్లుకునే ఏర్పాటు చేయవచ్చు.

  • బాల్కనీలో పెంచే మొక్కలన్నింటికీ ఒకేసారి ఒకేలా నీళ్లు పోయకూడదు. కుండీ సైజు, మట్టి స్వభావం, మొక్క అవసరం, ఎండ తీవ్రత, వాతావరణం తదితరాలను దృష్టిలో ఉంచుకుని తగురీతిలో మాత్రమే నీళ్లు అందించాలి.

  • కుండీల్లో నీటిని ధారగా పోయకుండా పిచికారీచేసే విధానాన్ని అనుసరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 12:29 AM