Share News

Gene Therapy Weight Loss: జీన్‌ థెరపీతో బరువు తగ్గొచ్చు

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:01 AM

శరీరం స్వయంగా జిఎల్‌పి-1 హార్మోన్‌ను ఉత్పత్తి చేసుకునేలా శరీరాన్ని రీప్రోగ్రామ్‌ చేయగలిగే మార్గాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు...

Gene Therapy Weight Loss: జీన్‌ థెరపీతో బరువు తగ్గొచ్చు

పురోగతి

శరీరం స్వయంగా జిఎల్‌పి-1 హార్మోన్‌ను ఉత్పత్తి చేసుకునేలా శరీరాన్ని రీప్రోగ్రామ్‌ చేయగలిగే మార్గాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఫ్రాక్టైల్‌ హెల్త్‌, రెన్‌బయో అనే రెండు బయెటెక్‌ స్టార్టప్స్‌, కణాలను జిఎల్‌పి-1 కర్మాగారాలుగా మార్చే జీన్‌ థెరపీ విధానాలను పరీక్షిస్తున్నాయి. ఎలుకల్లో ఈ చికిత్స సత్ఫలితాలను అందించి, బరువు తగ్గిస్తోంది. అవి మూడు వారాల వ్యవధిలో శరీరంలో 20ు బరువును కోల్పోవడాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదే సమయంలో అధిక కొవ్వు ఆహారాన్ని తిన్నప్పటికీ ఆ ఎలుకల్లో రక్తంలో చక్కెర మోతాదులు అదుపులోకొచ్చి, బరువు అదుపులో ఉంటున్నట్టు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. జిఎల్‌పి-1 మందుల ప్రభావాలను, ప్రయోజనాలను కనిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రయోగాల ద్వారా బరువు తగ్గడంతో పాటు, రక్తంలో చక్కెర మోతాదు నియంత్రణ, గుండెకు రక్షణ దక్కడం అనే అంశాల మీద శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. అయితే జన్యు చికిత్సతో కొన్ని ముప్పులు పొంచి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికోసారి తీసుకునే ఇంజెక్షన్లతో పోలిస్తే, ఈ చికిత్సలు తిరిగి సరిదిద్దే వీలు కల్పించవనీ, పాంక్రియా్‌సకు దీర్ఘకాలిక ముప్పులు తెచ్చిపెడతాయనీ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగాలు విజయవంతమైతే, మధుమేహం, ఊబకాయాలకు అందించే చికిత్సల్లో సమూల మార్పులొస్తాయి. ఈ రుగ్మతలకు దీర్ఘకాలిక మందులతో అందించే చికిత్సలకు బదులుగా అంతర్గత హార్మోన్‌ పునరుత్పత్తి చికిత్సలు అందుబాటులోకొస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Updated Date - Nov 18 , 2025 | 05:01 AM