దుస్తుల నుంచి దుర్వాసనా
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:53 AM
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఉతికిన దుస్తులు సరిగ్గా ఆరక దుర్వాసన వస్తాయి. అలాగే అల్మారాల్లోని దుస్తుల నుంచి కూడా వాసన వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే...
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఉతికిన దుస్తులు సరిగ్గా ఆరక దుర్వాసన వస్తాయి. అలాగే అల్మారాల్లోని దుస్తుల నుంచి కూడా వాసన వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో తెలుసుకుందాం..
నిమ్మరసం ఈ సమస్యను చక్కగా పరిష్కరిస్తుంది. ఒక చెంచా నిమ్మరసంలో కొంచెం నీరు కలిపి ఓ స్ర్పే బాటిల్‌లో పోయాలి. ఆ నీటిని వాసన వస్తున్న బట్టల మీద స్ర్పే చేసి గాలికి ఆరబెట్టాలి. నిమ్మరసం వాసన కలిగించే ఫంగన్ చంపి దుర్వాసనను తొలగిస్తుంది.
వెనిగర్ కూడా దుర్వాసనకు కారణమయ్యే ఫంగస్‌ను నివారించడంలో బాగా పనిచేస్తుంది. వెనిగర్‌ను దుస్తుల మీద చల్లి నీళ్లతో శుభ్రం చేసి ఆరేస్తే దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది.
వర్షాకాలంలో అల్మారాల్లో ఉన్న బట్టలు కూడా దుర్వాసన వెదజల్లుతాయి. అలాంటప్పుడు అల్మారాల మూలల్లో కొంచెం బేకింగ్ సోడా వేస్తే మంచి ఫలితముంటుంది.
అల్మారాలను బ్లీచింగ్ ద్రావణంలో ముంచిన వస్త్రంతో తుడిచి ఆరిన తరువాత దుస్తులను సర్దుకోవాలి. ఇలా చేసినా దుర్వాసన రాదు.
వాడేసిన బట్టలను ఎప్పటికప్పుడు ఉతకడం, వాషింగ్ మెషీన్‌లో ఉతికిన బట్టలను వెంటనే ఆరేసినా దుర్వాసన రాదు.
తడిసిన బట్టలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వెంటనే ఉతికేయాలి. గాలి బాగా తగిలే ప్రదేశంలో ఆరేస్తే దుస్తుల నుంచి వాసన రాకుండా ఉంటుంది.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News