Kids Sleep: పిల్లలు హాయిగా పడుకోవాలంటే...
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:54 AM
కొంతమంది చిన్న పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు. పెద్ద పిల్లలు కూడా అర్థరాత్రి వరకూ పడుకోరు. దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు హాయిగా నిద్రపోవడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలు...
పిల్లలు సరిగ్గా నిద్రపోవాలంటే వారికి నిద్ర వేళలు అలవాటు చేయాలి. అంటే రోజుకొక సమయం కాకుండా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపుచ్చాలి. క్రమం తప్పకుండా ఇలా కొద్ది రోజులు అలవాటు చేస్తే అదే వేళకు పిల్లలు నిద్రపోతారు.
మూడు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలను మాత్రమే పగటిపూట పడుకోబెట్టాలి. అంతకన్నా పెద్దవయసున్న పిల్లలను మధ్యాహ్నం పడుక్కోనివ్వకూడు. ఒకవేళ పడుక్కున్నా అరగంట తరవాత వారిని నిద్రలేపాలి. పగటిపూట పడుకున్న పిల్లలు రాత్రి వేళ నిద్రపోరు.
పడుకొనేముందు పిల్లలు హాయిగా ఆడుకునేలా చూడాలి. వాళ్ల మనసులో ఎటువంటి భయం, ఆందోళన కలుగకుండా చూసుకోవాలి. పసి పిల్లలకు మంచి పాట వినిపిస్తూ నిద్రపుచ్చాలి. కొంచెం పెద్ద పిల్లలకైతే కథలు చెబుతూ, సరదాగా మాట్లాడుతూ పడుకోబెట్టాలి. దీనివల్ల పిల్లల మనసు ప్రశాంతంగా మారి త్వరగా, ఎక్కువసేపు పడుకుంటారు.
కొంతమంది పిల్లలు చీకటికి, మరికొంతమంది ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుంటారు. పిల్లలు నిద్రించే గదిలో చిన్న బల్బు వేసి ఉంచాలి. పడుకునేముందు భయానకమైన సినిమాలు చూడనివ్వకూడదు. త్వరగా పడుకోవాలని బెదిరించకూడదు. పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందు తల్లిదండ్రులు వారితో కొంత సమయం గడిపితే ధైర్యంగా ఉంటారు.
పిల్లలు నిద్రించే సమయంలో టీవీ పెట్టకూడదు. తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడుతున్నా కూడా పిల్లలు పడుకోరు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.
రాత్రి పూట వీలైనంత త్వరగా పిల్లలకు భోజనం పెట్టాలి. లేదంటే జీర్ణ సమస్యలు ఏర్పడి పిల్లలు త్వరగా నిద్రపోరు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News