Kids: పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకుంటున్నారా!
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:21 AM
చిన్న పిల్లలు సాధారణంగా బొటనవేలుని లేదంటే చేతి వేళ్లన్ని టినీ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్య లు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో ఈ అలవాటును మాన్పించడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలు ఇవి...
కాకరకాయ రసం లేదా కరక్కాయ రసాన్ని చేతి వేళ్లకి పట్టిస్తే చేదు రుచి నచ్చక పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోవడం మానేస్తారు.
పిల్లలు ఏ వేలుని నోట్లో పెట్టుకుంటున్నారో గమనించి దానికి పలుచని వస్త్రాన్ని చుట్టడం లేదా వేళ్లన్నింటిని కలిపి కట్టులా కట్టడం వల్ల పిల్లల్లో ఈ అలవాటు తగ్గుతుంది.
అరచేయి మొత్తాన్ని పూర్తిగా కప్పే గ్లోవ్స్ వేయడం వల్ల కూడా ప్రయోజనం కనిపిస్తుంది.
నెలల పిల్లలు ఆకలి అనిపించినప్పుడు బొటనవేలిని నోట్లో పెట్టుకుంటారు. వారి ఆకలి వేళలు గుర్తించి సమయానుసారం పాలు పట్టడం వల్ల క్రమంగా ఈ అలవాటుని మానేస్తారు.
నోట్లో వేళ్లు పెట్టుకున్నవెంటనే వాటిని తీసివేసి పిల్లల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తే పలితం ఉంటుంది.
పిల్లలు ఓదార్పు లేదా తోడు కోరుకున్నప్పుడు, మనసులో భయాన్ని వ్యక్తపరిచేముందు ఇలా నోట్లో వేళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉండి ధైర్యం చెబితే ఈ అలవాటుని మానుకుంటారు.
శాశ్వత దంతాలు వచ్చే సమయం వరకూ పిల్లలు ఈ అలవాటుని కొనసాగిస్తే పలువరస క్రమం తప్పుతుంది. పళ్ల మధ్య సందులు ఏర్పడతాయి. కాబట్టి తల్లిదండ్రులు తగిన ప్రయత్నం చేసి ఈ అలవాటుని మాన్పించాలి.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు