వీటితో క్యాన్సర్ ముప్పు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:31 AM
మనం రోజూ తీసుకునే ఆహారపదార్థాలు క్యాన్సర్ కారకాలు కావచ్చని హార్వర్డ్ వైద్యులు, డాక్టర్ సురభ్ సేథీ హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!...
మీకు తెలుసా?
మనం రోజూ తీసుకునే ఆహారపదార్థాలు క్యాన్సర్ కారకాలు కావచ్చని హార్వర్డ్ వైద్యులు, డాక్టర్ సురభ్ సేథీ హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!
ప్రాసెస్ చేసిన మాంసం: సాసేజ్‌లు, ముందస్తుగా ఉడికించి ఉంచిన మాంసాలను గ్రూప్ 1 క్యాన్సర్ కారకాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. వీటితో ప్రత్యేకించి పెద్దపేగు క్యాన్సర్ ముప్పు ఉందనే స్పష్టమైన ఆధారాలున్నట్టు తేలిపోయింది. ఈ మాంసాల నిల్వ కోసం ఉపయోగించే నిల్వ పదార్థాలు, నైట్రేట్స్ పేగుల్లోని కణాలను దెబ్బతీసి, దీర్ఘకాలంలో క్యాన్సర్ కారక ఉత్పరివర్తనాలకు దారి తీస్తాయి. కాబట్టి ఈ రకం మాంసాహారానికి దూరంగా ఉండడం ఉత్తమం తీపి పానీయాలు: శీతల పానీయాలు, తీయని ద్రవపదార్థాలు రక్తంలో చక్కెర మోతాదులను పెంచడానికి మించి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటితో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి, రొమ్ము, పెద్దపేగు, క్లోమ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి తీయని పానీయాలకు బదులుగా కొబ్బరినీళ్లు, హెర్బల్ టీలు లాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి
వేపుళ్లు: ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, బజ్జీలను వేయించడం కోసం ఒకే నూనెను పదే పదే ఉపయోగిస్తూ ఉంటారు. దాంతో ఈ నూనెల్లో క్యాన్సర్ సంబంధిత కాంపౌండ్, అక్రిలమైడ్ తయారవుతుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలను పదే పదే తినడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్, తీవ్రమైన ఇన్‌ఫ్లమేషనుల పెరిగి, క్యాన్సర్ వృద్ధికి అనువైన పరిస్థితులు శరీరంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇలా నూనెలో వేయించడానికి బదులుగా బేక్ చేయడం లేదా ఎయిర్ ఫ్రైయింగ్ పద్ధతులను అనుసరించడం ఆరోగ్యకరం
కాల్చిన మాంసం: అత్యధిక ఉష్ణోగ్రతలను కలిగి ఉండే గ్రిల్స్ మీద మాంసాన్ని కాల్చే సమయంలో డిఎన్‌ఎను దెబ్బతీసే హానికారక కాంపౌండ్లు విడుదల అవుతాయి. ఇవి క్యాన్సర్‌ను పెంచుతాయి. అలాగే గ్రిల్ చేయడానికి ముందు మాంసాన్ని నానబెట్టడం, రోజ్‌మేరీ లాంటి మూలికలను ఉపయోగించడం వల్ల ఈ ముప్పు కొంతమేరకు తగ్గుతుంది. అయితే గ్రిల్‌కు బదులుగా ఆవిరి మీద ఉడికించడం, బేక్ చేయడం లేదా చిన్న మంట మీద ఎక్కువ సమయం పాటు ఉడికించడం సురక్షితం
మద్యపానం: మద్యంతో ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదు పెరిగి ఫోలేట్ శోషణ కుంటుపడుతుంది. ఈ పరిస్థితి డిఎన్‌ఎ మరమ్మతు యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో హార్మోన్ సంబంధిత రొమ్ము, కాలేయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి మద్యానికి బదులుగా పులియబెట్టిన నాన్ ఆల్కహాలిక్ పానీయాలైన బీట్‌రూట్ కాంజి, కంబూచ లాంటి సురక్షితమైన ఆరోగ్య ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News