ఇంటికి దూరంగా ఉంటున్నారా
ABN , Publish Date - May 15 , 2025 | 05:39 AM
ఒక్కోసారి పై చదువుల కోసం లేదా ఉద్యోగాల నిమిత్తం వేరే ఊళ్లకి వెళ్లి అక్కడ వసతి గృహాల్లో లేదా అద్దె ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. ఒంటరిగా ఉండడం బాధగా భయంగా అనిపిస్తుంది కూడా...
ఒక్కోసారి పై చదువుల కోసం లేదా ఉద్యోగాల నిమిత్తం వేరే ఊళ్లకి వెళ్లి అక్కడ వసతి గృహాల్లో లేదా అద్దె ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. ఒంటరిగా ఉండడం బాధగా భయంగా అనిపిస్తుంది కూడా. ఇలా కొత్త ప్రదేశాల్లో ఉండాల్సివచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు పరిశుభ్రమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో అడిగి తెలుసుకోవాలి. తాగు నీటి నాణ్యతను పరిశీలించాలి. హాస్టల్‌లో ఉంటున్నట్లయితే అక్కడ ఆహారం వండే విధానాన్ని పరీక్షించాలి. వంటగదిలో పరిశుభ్రత పాటిస్తున్నారో లేదో తెలుసుకోవాలి.
అత్యవసరమైన మందులను దగ్గర ఉంచుకోవాలి.
హాస్టల్ లేదా అద్దె ఇంటి చిరునామాను కుటుంబ సభ్యులకు, దగ్గరి స్నేహితులకు తెలియజేయాలి.
ఉంటున్న ప్రదేశానికి దగ్గరలోని ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, రెస్టారెంట్, ట్రాన్స్‌పోర్ట్‌లకు సంబంధించిన ఫోన్ నెంబర్లను మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోవాలి.
వ్యక్తిగత సమాచారాన్ని తెలిపే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, కాలేజీ లేదా ఉద్యోగానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్‌లను దగ్గర ఉంచుకోవాలి.
అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవరచుకోవాలి.
కొత్త ప్రదేశం అలవాటు కావడానికి సమయం పడుతుంది కాబట్టి వీలైనప్పుడల్లా పరిసరాల్లో తిరుగుతూ ఆ కాలనీ లేదా వీధి గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
ఒంటరిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ఫోన్ లేదా వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉండాలి.
రూమ్‌మేట్స్ ఉన్నట్లయితే వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాళ్లని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.
రాత్రి సమయాల్లో బయట ఎక్కువగా తిరగవద్దు. మొబైల్లో లొకేషన్ సెట్ చేసి పెట్టుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News