Share News

Admissions: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ పీజీ అడ్మిషన్స్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 06:05 AM

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 17 బ్రాంచ్‌లకు సంబందించిన ఇంటిగ్రేటెడ్‌ అడ్మిషన్‌ 2025-26 కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఐదు సంవత్సరాల సీయూఈటీ (యూజీ) 2025 ఆధారంగా...

Admissions: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ పీజీ అడ్మిషన్స్‌

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 17 బ్రాంచ్‌లకు సంబందించిన ఇంటిగ్రేటెడ్‌ అడ్మిషన్‌ 2025-26 కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఐదు సంవత్సరాల సీయూఈటీ (యూజీ) 2025 ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ: మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్‌ జియాలజీ, సైకాలజీల్లో ఈ కోర్సులను అందిస్తున్నారు. ఇందులో మేథ్స్‌, ఫిజిక్స్‌లో 40 సీట్లు, బయాలజీల్లో 60 సీట్లు, సైకాలజీ, కెమిస్ట్రీల్లో 20 సీట్లు, అప్లైడ్‌ జియాలజీలో 18 సీట్లు ఉన్నాయి.

మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ: ఇందులో 28 సీట్లు ఉన్నాయి.

బీఎస్‌ ఆనర్స్‌: నాలుగు సంవత్సరాల బీఎస్‌ ఆనర్స్‌ కోర్సు ఉంది. ఇందులో 20 సీట్లు ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ: తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌, ఉర్దూ, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంథ్రోపాలజీల్లో ఎంఏ కోర్సులను అందిస్తున్నారు. ఇందులో తెలుగు, లాంగ్వేజ్‌ సైన్సెస్‌లో 19 సీట్లు, హిందీ, ఆంథ్రోపాలజీల్లో 20 సీట్లు, ఉర్దూలో 14 సీట్లు, ఎకనామిక్స్‌లో 17 సీట్లు, హిస్టరీలో 35 సీట్లు, పొలిటికల్‌ సైన్స్‌లో 50 సీట్లు, సోషియాలజీలో 25 సీట్లు ఉన్నాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూలై 30

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/


నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2026-27 సంవత్సరం ప్రవేశాల దరఖాస్తు స్వీకరణ గడువు 2025 జూలై 29. దేశ వ్యాప్తంగా 654 జేఎన్‌వీల్లో ప్రవేశాలు నిర్వహిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 పాఠశాలలు ఉన్నాయి. డిసెంబర్‌ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

  • ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉంటాయి. ఇందులో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిచారు. మిగిలిన 25 సీట్లకు ఎవరైన పోటీ పడవచ్చు. గ్రామీణ ప్రాంతాల సీటు కావాలనుకునే విద్యార్థులు 3, 4, 5 తరగతులు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 29

వెబ్‌సైట్‌: cbseitms.rcil.gov.in/nvs/?Aspx


అన్నా యూనివర్సిటీలో ఎంటెక్‌, ఎంఈ

తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ 2025-26 సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(ఎంఈ), మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(ఎంఆర్క్‌), మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌(ఎంప్లానింగ్‌) కోర్సుల్లో అడ్మిషన్స్‌ ప్రారంభించింది. వీటిలో 2023, 2024, 2025 గేట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 20వ తేదీలోపు ceap.annauniv.edu పోర్టల్‌లోకి లాగిన్‌ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.

టీజీ సీపీజీఈటీ

‘తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌’(టీజీ సీపీజీఈటీ-2025) నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులతోపాటు, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిప్లొమాలో అడ్మిషన్‌ కోసం ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీలతోపాటు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూలోని 45 కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ 2025 జూలై 17. ఆలస్య రుసుము రూ.500/-తో జూలై 24, ఆలస్య రుసుము రూ.2000/-తో జూలై 28 వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు.

  • 2025 ఆగస్ట్‌4వ తేదీ నుంచి ఎంట్రెన్స్‌లు ప్రారంభం అవుతాయి. ఇది పూర్తిగా కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌(సీబీటీ). పూర్తి వివరాలు త్వరలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

ఇవి కూడా చదవండి

నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 06:07 AM