Share News

ఎవర్‌ గ్రీన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:03 AM

నిన్న మొన్నటి దాకా ఇంజనీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థుల మొదటి చాయిస్‌ కంప్యూటర్‌ సైన్స్‌. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వచ్చిన తరువాత పరిస్థితి మారింది. మార్కెట్‌లో ఉద్యోగాలు తగ్గడం...

ఎవర్‌ గ్రీన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

కెరీర్‌ గైడ్‌

నిన్న మొన్నటి దాకా ఇంజనీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థుల మొదటి చాయిస్‌ కంప్యూటర్‌ సైన్స్‌. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వచ్చిన తరువాత పరిస్థితి మారింది. మార్కెట్‌లో ఉద్యోగాలు తగ్గడం మొదలయ్యాయి. పులిమీద పుట్రలా అమెరికా జాబ్‌ మార్కెట్‌ ఇబ్బందులతో మరింత క్షీణించింది. దీంతో సీఎస్సీ చదవాలనే విద్యార్థుల ఆలోచనలు మారి కోర్‌ సబ్జెక్టుల వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు. అంతే కాకుండా విద్యార్థులను ఇటువైపు మళ్లేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్‌ బ్రాంచెస్‌లు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు రాయ్‌పూర్‌ ఎన్‌ఐటీ డైరెక్టర్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణరావు. ఆయన గతంలో ఎంసెట్‌ కన్వీనర్‌గా, ఎన్‌ఐటీ వరంగల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

కెరీర్‌ అవకాశాలు అధికంగా ఉన్న ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ వాస్తవానికి ప్రాక్టికల్‌ డిసిప్లిన్‌. ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు కలగలిసి రీసెర్చ్‌ - డెవల్‌పమెంట్‌ సంస్థలు మొదలుకుని అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సంస్థలు, మాన్యుఫాక్చరింగ్‌, ప్రభుత్వ, టెక్‌ కంపెనీల్లో పనిచేయవచ్చు. 2021-2031 మధ్య పదేళ్ళలో ఈ పరిశ్రమ ఎదుగుదల మూడు శాతంగా లెక్కగట్టారు. మన దేశంలో ఏటా సగటున ఇరవై వేల కంటే కొద్దిగా ఎక్కువ ఉద్యోగాలు ఈ పదేళ్ళలో వీరికి లభిస్తాయి. ప్రజలందరూ కంప్యూటర్‌ వైపు వెళుతుండడంతో, వీరికి జాబ్‌ గ్యారెంటీ లభిస్తోంది అనే చెప్పాలి.


  • అవకాశాల విషయానికి వస్తే ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీర్లకు ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌, కం ట్రోల్‌ సిస్టమ్‌, సిస్టమ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, సేల్స్‌, కన్జూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌, మాన్యుఫాక్చరింగ్‌, కెమికల్‌, ఆటోమోటివ్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రీసెర్చ్‌ తదితర సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. నిర్దేశిత ప్రొఫెషన్‌కు మాత్రమే వీరు పరిమితం కారు కూడా.

  • భిన్న రంగాలు అంటే హౌస్‌హోల్డ్‌ అప్లయిన్సెస్‌ డివిజన్‌, భవన నిర్మాణాల్లో ఎలక్ట్రికల్‌ సిస్టమ్‌ డిజైన్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌/ కార్లు, రైల్వేస్‌, ఎయిర్‌పోర్ట్స్‌, రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, సొఫిస్టికేటెడ్‌ మెడికల్‌ ఎక్వి్‌పమెంట్స్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేటింగ్‌ - ట్రాన్స్‌మిషన్‌ - డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల్లో కెరీర్‌ అవకాశాలు ఉంటాయి.

సంబంధిత బ్రాంచీలు

ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌(పవర్‌ సిస్టమ్‌), ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌(ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ పవర్‌), ఎలక్ట్రికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎలకా్ట్రనిన్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఇంజనీరింగ్‌ ఉన్నాయి.


కెరీర్‌ అవకాశాలు

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారికీ అనేకానేక అవకాశాలు ఉన్నాయి. హౌస్‌హోల్డ్‌ అప్లయిన్సెస్‌ డిజైనింగ్‌, భవనాలకు ఎలక్ట్రికల్‌ సిస్టమ్‌ డిజైన్‌, రైల్వేలు, విమానాశ్రయాలు, రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, ఎలక్ట్రిసిటీ జనరేషన్‌ - ట్రాన్స్‌మిషన్‌ - డిస్ట్రిబ్యూషన్‌, ఆసుపత్రుల్లో సొఫిస్టికేటెడ్‌ మెడికల్‌ ఎక్వి్‌పమెంట్స్‌కు తోడు ప్రభుత్వ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎఎల్‌ఎ్‌సటిఔం ఇండియా లిమిటెడ్‌, స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌, బీహెచ్‌ఈఎల్‌, ఎబిబి ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్స్‌, ఎన్‌టీపీసీ, జీఈ, ప్రభుత్వ కళాశాలల్లో టీచింగ్‌, హెచ్‌ఏఎల్‌, డీఆర్‌డీఓ, ఎల్‌ అండ్‌ టీ, ఇస్రో, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌, సీడేక్‌, ఓఎన్‌జీసీ, ఐఓఎల్‌, ఇస్రో, ఐఓసీఎల్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, పీడబ్ల్యూడీ, బీపీసీఎల్‌, సైమన్స్‌, హెచ్‌పీసీఎల్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, హార్బర్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌, ఇండియన్‌ రైల్వేస్‌- ఆర్‌ఆర్‌బీ టాటా స్టీల్‌, ఇరిగేషన్‌ విభాగం, గెయిల్‌, టాటా మోటార్స్‌, సెయిల్‌, టాటా ఇలా పలు సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.

ప్రయోజనాలు

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ తరవాత ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉంటుంది. మేథ్స్‌, ఫిజిక్స్‌ సహా ఎలక్ట్రికల్‌ అప్లికేషన్స్‌కు సంబంధించిన గైడింగ్‌ ప్రిన్సిపల్స్‌లో మార్పు ఉండనందున గ్లోబల్‌ కంపెనీలన్నీ వీరిని తీసుకుంటాయి. అనుభవజ్ఞులకు మాదిరిగా ఎక్కువ వేతనాలు ఉండవు. అయితే ఫ్రెషర్స్‌ను కూడా మల్టీనేషనల్‌ కంపెనీలు తీసుకుని తమకు అవసరమైన రీతిలో శిక్షణ ఇచ్చుకుంటాయి. కొద్దికాలం అనుభవం గడించిన తరవాత ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చేసి పొజిషన్‌ను మెరుగుపర్చుకోవచ్చు.

ప్రొ. ఎన్‌.వి.రమణారావు

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 03:03 AM