Share News

బంగారు ఆభరణాలు కొత్తగా మెరవాలంటే

ABN , Publish Date - Jul 03 , 2025 | 02:35 AM

మనం ధరించే బంగారు ఆభరణాలు కొన్ని రోజుల తరవాత మెరుపు తగ్గి నల్లబడుతుంటాయి. వీటిమీద చెమట, దుమ్ము, ధూళి చేరడమే దీనికి కారణం. కొన్ని ఇంటి చిట్కాలతో బంగారు ఆభరణాలను...

బంగారు ఆభరణాలు కొత్తగా మెరవాలంటే

మనం ధరించే బంగారు ఆభరణాలు కొన్ని రోజుల తరవాత మెరుపు తగ్గి నల్లబడుతుంటాయి. వీటిమీద చెమట, దుమ్ము, ధూళి చేరడమే దీనికి కారణం. కొన్ని ఇంటి చిట్కాలతో బంగారు ఆభరణాలను కొత్తవాటిలా మెరిపించవచ్చు.

  • టమాటాను మధ్యకు కోసి లోపలి గింజలను తీసివేయాలి. ఈ టమాటా ముక్క మీద కొద్దిగా ఉప్పు చల్లి దానితో ఆభరణాలను సున్నితంగా రుద్దాలి. తరవాత చల్లటి నీళ్లతో ఆభరణాలను శుభ్రంగా కడిగి మెత్తటి రుమాలు లేదా తువాలుతో తుడిస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.

  • వెడల్పాటి గిన్నెలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోసి అందులో ఒక చెంచా బేకింగ్‌ సోడా వేసి కలపాలి. ఈ నీటిలో బంగారు ఆభరణాలు వేసి అర గంటసేపు నానబెట్టాలి. తరవాత పాత టూత్‌బ్ర్‌షతో వాటిని మెల్లగా రుద్ది కడగాలి. పేరుకున్న మురికి తొలగిపోయి ఆభరణాలు చక్కగా మెరుస్తాయి.

  • ఆభరణాల మీద గోరువెచ్చని నీరు చల్లి కొద్దిగా టూత్‌పేస్టు రాయాలి. తరవాత మెత్తటి బ్రష్‌తో రుద్ది నీళ్లతో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • చింతపండు లేదా కుంకుడు రసంలో కొద్దిసేపు నానబెట్టి తరవాత మంచినీళ్లతో శుభ్రం చేసినా బంగారు ఆభరణాలకు మెరుపు వస్తుంది.

  • ఖరీదైన రత్నాలు, రాళ్లు, ముత్యాలు పొదిగిన ఆభరణాలను నీళ్లలో నానబెట్టకూడదు. అలా చేస్తే వాటి మెరుపు పోతుంది. మెత్తటి గుడ్డ లేదా దూదిని కొద్దిగా తడిపి పైపైన తుడిస్తే చాలు.

  • శుభ్రం చేసిన ఆభరణాలు పొడిగా ఆరిన తరవాతనే నిర్ణీత బాక్సుల్లో భద్రపరచుకోవాలి.

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 02:36 AM