రెండింతలు ఎక్కువ తినేస్తున్నాం
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:18 AM
ఒక మనిషి రోజుకు 5 గాముల కంటే తక్కువ ఉప్పు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ పోషకాహార సంస్థలు సూచిస్తున్నాయి. కానీ మన ఉత్తరాది రాష్ట్రాల్లో సగటున ఒర మనిషి రోజుకు 12 గ్రాముల కంటే ఎక్కువ...
తెలుసుకుందాం
ఒక మనిషి రోజుకు 5 గాముల కంటే తక్కువ ఉప్పు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ పోషకాహార సంస్థలు సూచిస్తున్నాయి. కానీ మన ఉత్తరాది రాష్ట్రాల్లో సగటున ఒర మనిషి రోజుకు 12 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారు. ఇలా అధిక ఉప్పు తీసుకోవడం వలన అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. రక్తపోటును పరిష్కరించే లక్ష్యంతో ఇటీవల నిర్వహించిన ఓ జాతీయస్థాయి వర్క్‌షా్‌పలో వైద్యులు ఈ విషయాలను ప్రస్తావించారు. రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు ఇంట్లో వండే వంటల్లోనూ ఉప్పును అధికంగా వాడుతున్నారని వైద్యులు అంటున్నారు. 80 శాతం ఉప్పు ఇంటి వంటల ద్వారానే తీసుకుంటున్నామనీ, ముఖ్యంగా ఊరగాయలు, అప్పడాలు, చట్నీలు, సలాడ్, మజ్జిగ. సాస్‌ల ద్వారా ఉప్పు అధిక మోతాదులో తీసుకుంటున్నట్లు తెలిపారు. గులాబీ ఉప్పు, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు తక్కువగా ఉఉంటుందన్నది అపోహ మాత్రమేనని వైద్యులు అంటున్నారు. కాకపోతే వాటిలోని ఖనిజాల పరిమాణాల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News