Share News

Silver Jewelry: వెండి నగలు మెరవాలంటే..!

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:53 AM

ప్రస్తుతం వెండి నగలు ధరించడం అనేది సరికొత్త ఫ్యాషన్‌గా మారింది. చెవి కమ్మలు, కంకణాలు, ఉంగరాలు, గొలుసులు ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. వెండి నగలు వాడుతున్నప్పుడు ఒంటి వేడి వల్ల, వాతావరణ మార్పుల కారణంగా అవి నల్లగా మారుతుంటాయి. వీటిని చిన్న చిట్కాలతో అందంగా మెరిసేలా ఉంచుకోవచ్చు.

Silver Jewelry: వెండి నగలు మెరవాలంటే..!

మహిళలు మేకప్‌ వేసుకోవడం, అత్తరు చల్లుకోవడం లాంటి పనులు పూర్తిచేసిన తరవాతనే వెండి నగలు పెట్టుకోవాలి. లేదంటే మేకప్‌ సామగ్రిలోని రసాయనాల వల్ల నగలు నల్లబడే అవకాశం ఉంది.

వర్షాకాలంలో వెండి ఆభరణాలు ధరించకూడదు. వర్షపు నీటివల్ల నగలపై పలుచని పొర ఏర్పడి మెరుపుని కోల్పోతాయి. అనుకోకుండా నగలు తడిచినప్పుడు వాటిని పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. మెరుగు పెట్టించుకోవడం మంచిది.

ఇంటి పనులు చేసేటప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వెండి నగలు ధరించకూడదు.

వెండి ఆభరణాలను గాలి తగలని పొడి ప్రదేశంలో భద్రపరచాలి. ఆ ప్రదేశంలో రెండు సుద్ద ముక్కలు లేదా సిలికా జెల్‌ ప్యాకెట్‌ని ఉంచాలి. ఇవి గాలిలోని తేమను పీల్చుకుని ఆభరణాలు నల్లబడకుండా కాపాడతాయి.


జిప్‌లాక్‌ సౌకర్యం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లలో వెండి నగలు దాచుకుంటే అవి ఎప్పటికీ కొత్తవాటిలాగే ఉంటాయి.

వెండి నగలు దాచే బాక్స్‌లో నాలుగు మూలలా దూది ఉండలు లేదా వెల్వెట్‌ వస్త్రం ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.

వెండి ఆభరణాలను రసాయనాలతో కూడిన ద్రవాలతో శుభ్రం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే వెనిగర్‌, బేకింగ్‌ సోడాలను ఉపయోగించి టూత్‌బ్ర్‌షతో రుద్ది కడిగితే అవి సహజంగా మెరుస్తాయని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:53 AM