Share News

Baking Soda For Fabric Stains: నూనె మరకలా..

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:18 AM

ఒక్కోసారి దుస్తుల మీద నూనె మరకలు ఎంత ప్రయత్నించినా వదలవు. ఈ చిట్కాలతో వాటిని వదిలించుకోవచ్చు.

Baking Soda For Fabric Stains: నూనె మరకలా..

ఒక్కోసారి దుస్తుల మీద నూనె మరకలు ఎంత ప్రయత్నించినా వదలవు. ఈ చిట్కాలతో వాటిని వదిలించుకోవచ్చు.

  • నూనె మరక మీద కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లాలి. పది నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత పాత టూత్‌ బ్రష్‌తో రుద్దితే నూనె మరక మాయమవుతుంది. గంజి పొడి వేసి రుద్దినా ఫలితం కనిపిస్తుంది.

  • చిన్న గిన్నెలో నాలుగు చుక్కల వెనిగర్‌ వేసి రెండు చుక్కల నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలితో తీసుకుని మరక మీద రుద్దాలి. అయిదు నిమిషాల తరవాత మంచినీళ్లతో కడిగేస్తే నూనె మరక తొలగిపోతుంది.

  • మరక పడిన దుస్తులను చల్లని నీళ్లలో ముంచి తీయాలి. తరవాత మరక మీద కలబంద గుజ్జు వేసి రుద్దితే ఫలితం ఉంటుంది.

  • నూనె మరక మీద రెండు చుక్కల నిమ్మ రసం వేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత దుస్తులను మామూలుగా ఉతికి ఆరేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 06:18 AM