Share News

Heart Attack Symptoms: గుండెపోటుకు ముందు

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:24 AM

గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న వాళ్లను చూస్తున్నాం! నిజంగానే గుండెపోటు అకస్మాత్తుగా తలెత్తుతూ ఉంటుందా? ముందస్తు లక్షణాలేవీ లేకుండానే ప్రాణాలను...

Heart Attack Symptoms: గుండెపోటుకు ముందు

మీకు తెలుసా?

గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న వాళ్లను చూస్తున్నాం! నిజంగానే గుండెపోటు అకస్మాత్తుగా తలెత్తుతూ ఉంటుందా? ముందస్తు లక్షణాలేవీ లేకుండానే ప్రాణాలను హరిస్తుందా? వాస్తవమేంటో తెలుసుకుందాం!

గుండెపోటుకు కొన్ని రోజులు, వారాల ముందు కొన్ని లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి, అప్రమత్తం కాగలిగితే గుండెపోటుకు గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్‌, మొనిసోలా అడానిజో. ఆ లక్షణాలు ఏవంటే..

ఛాతోలో నొప్పి, అసౌకర్యం: నొక్కినట్టు, బరువుగా ఉన్నట్టు అనిపించడం, ఛాతీలో మంట. ఈ లక్షణాలు ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున కనిపించవచ్చు. లక్షణాలు వచ్చి పోతూ ఉండవచ్చు.

ఇతరత్రా నొప్పులు: గుండె సమస్య ఛాతీకే పరిమితం కావాలనే నియమమేమీ లేదు. వెన్ను, మెడ, దవడ, పైపొట్ట... ఈ శరీర భాగాల్లో కూడా నొప్పి రూపంలో బయల్పడవచ్చు.

శ్వాస ఇబ్బంది: గుండె జబ్బులు ఆక్సిజన్‌ ప్రవాహాన్ని తగ్గించి, శ్వాసను కష్టతరం చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా మెట్లు ఎక్కుతున్నప్పుడు, లేదా పడుకుని ఉన్నప్పుడు శ్వాస ఇబ్బందికరంగా మారితే అప్రమత్తం కావాలి.

చమటలు: చల్లని గదిలో ఉన్నా, పడుకుని ఉన్నా అకస్మాత్తుగా చమటలు పట్టేస్తుంటే, వెంటనే గుండె వైద్యులను కలవాలి.

తలతిరుగుడు: గుండెపోటుకు ముందు తలతిరుగుడు, అజీర్తి, ఛాతీలో మంట, వాంతులు లాంటి లక్షణాలను ఎంతోమంది ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి పొట్టలో అసౌకర్యాలకు ఛాతీలో ఇబ్బంది, నిస్సత్తువ, చమటలు కూడా తోడైతే వెంటనే వైద్యులను కలవాలి.

నిస్సత్తువ: ఎలాంటి శారీరక శ్రమకు లోను అవకపోయినా, ఉన్నట్టుండి నిస్సత్తువ ఆవరిస్తున్నా, చిన్నపాటి పనికే విపరీతంగా అలసట ఆవరిస్తున్నా గుండెలో సమస్య తలెత్తుతోందని అర్థం.

ఇవి కూడా చదవండి..

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 07:04 AM