Share News

Expired Medicines: ఈ మందులు చెత్త బుట్టలో వేయొద్దు..

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:12 AM

కాలం చెల్లిన కొన్ని మందులను చెత్తబుట్టలో పారేయడం ప్రమాదకరమని కేంద్ర ఔషథ నియంత్రణ సంస్థ చెబుతోంది. నొప్పి, ఆందోళన మొదలైన సమస్యలకు వాడే ట్రమడాల్‌, టాపెంటడాల్‌, డైజిపామ్‌...

Expired Medicines: ఈ మందులు చెత్త బుట్టలో వేయొద్దు..

కాలం చెల్లిన కొన్ని మందులను చెత్తబుట్టలో పారేయడం ప్రమాదకరమని కేంద్ర ఔషథ నియంత్రణ సంస్థ చెబుతోంది. నొప్పి, ఆందోళన మొదలైన సమస్యలకు వాడే ట్రమడాల్‌, టాపెంటడాల్‌, డైజిపామ్‌, ఆక్సికోడోన్‌, ఫెంటానిల్‌ వంటి 17 రకాల మందులు ఎంతో ప్రభావంతమైనవని ఔషథ నియంత్రణ సంస్థ వెల్లడించింది. వైద్యులు సూచించిన రోగులు మినహా వాటిని ఎవరు తీసుకున్నా, తీవ్రమైన ప్రభావాన్ని కనబరుస్తాయనీ, ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందనీ, కొన్నిసార్లు ఒక్క డోసు తీసుకున్నా ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయిని ఔషథ నియంత్రణ సంస్థ హెచ్చరిస్తోంది. అలాంటి ఆ మందులు మిగిలిపోయినా, కాలం చెల్లినా, లేదా లేబుల్‌ చిరిగిపోయినా చెత్త బుట్టలో పారేయవద్దని సూచిస్తోంది. అలా పారేస్తే, వాటిని పొరపాటున చిన్న పిల్లలు, పారిశుద్ధ్య కార్మికులు, జంతువులు తినే ప్రమాదం ఉందని తెలిపింది. ఆ మందులు జంతువులు తాగే నీటిలో కలిసే ప్రమాదం కూడా లేకపోలేదని వివరించింది. చెత్తలోకి చేరిన ఆ మందులు అక్రమార్కుల చేతిల్లోకి చేరుకుంటే అవి దుర్వినియోగం అవడం లేదా మళ్లీ మార్కెట్‌లోకి చేరుకునేప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే ఆ మందులను టాయిలెట్‌లో వేసి ఫ్లష్‌ చేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి..

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 09:31 AM