Share News

Divyanshi Bhawmik: రాకెట్‌ పడితే పతకాల పంట

ABN , Publish Date - Jul 23 , 2025 | 02:33 AM

దివ్యాంశి భౌమిక్‌... టేబుల్‌ టెన్నిస్‌ రాకెట్‌ పడితే ప్రత్యర్థి ఎవరైనా దూకుడుగా పోరాడడం ఆమె నైజం. ఇటీవల తాష్కెంట్‌లో జరిగిన ‘ఏషియన్‌ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌...

Divyanshi Bhawmik: రాకెట్‌ పడితే పతకాల పంట

దివ్యాంశి భౌమిక్‌... టేబుల్‌ టెన్నిస్‌ రాకెట్‌ పడితే ప్రత్యర్థి ఎవరైనా దూకుడుగా పోరాడడం ఆమె నైజం. ఇటీవల తాష్కెంట్‌లో జరిగిన ‘ఏషియన్‌ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షి్‌ప- సింగిల్స్‌’లో సంచలన విజయాలు నమోదు చేసింది.

అంతేకాదు... ముప్ఫై ఆరేళ్ళ తరువాత ఆ పోటీల్లో టైటిల్‌ నెగ్గిన భారతీయురాలిగా నిలిచింది. అండర్‌-15 వరల్డ్‌-3 ర్యాంక్‌లో ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్‌ స్వర్ణమే తన లక్ష్యం అంటోంది.

‘‘ప్రతి మ్యాచ్‌ ఏదో ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ఎప్పటికప్పుడు సాంకేతికంగా, మానసికంగా, శారీరకంగా మెరుగుపడుతూనే ఉండాలి. క్రీడలు మన వ్యక్తిత్వానికి సానపెడతాయి. అందుకే నాకు క్రీడలంటే ప్రాణం’’ అంటోంది దివ్యాంశి భౌమిక్‌. ఈనెల మొదటివారంలో... ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ముగిసిన ‘ఏషియన్‌ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షి్‌్‌ప- సింగిల్స్‌లో ఆమె స్వర్ణాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. సుబ్రమణియన్‌ భువనేశ్వరి (1986లో) తరువాత... 36 ఏళ్ళకు ఈ టైటిల్‌ను మన దేశానికి తీసుకువచ్చిన దివ్యాంశి... భారత మహిళా టేబుల్‌ టెన్నిస్‌ ఆశాకిరణంగా ప్రశంసలందుకుంటోంది.


అప్పుడు సీరియ్‌సగా తీసుకోలేదు...

దివ్యాంశి కుటుంబం కోల్‌కతా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడింది. ఆమె తండ్రి రాహుల్‌ ఒక బహుళ జాతి కంపెనీలో ఉన్నతాధికారిగా ఉన్నారు. ‘‘మా స్కూల్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను తప్పనిసరిగా అభ్యసించాలి. నేను టేబుల్‌ టెన్నిస్‌ ఎంచుకున్నాను. కానీ అప్పుడు దాన్ని సీరియ్‌సగా తీసుకోలేదు’’ అని చెబుతోంది దివ్యాంశి. అయితే కొవిడ్‌ లాక్‌డౌన్‌తో ఇంటిల్లిపాదికీ తీరిక దొరికింది. అక్క హితాంశితో, ఒకప్పుడు క్రీడాకారుడైన తండ్రితో ఇంట్లోనే వీలైనంతసేపు టేబుల్‌ టెన్ని్‌సను దివ్యాంశి ప్రాక్టీస్‌ చేసింది. ‘‘అప్పుడే నాకు ఆ ఆట మీద ఇష్టం ఏర్పడింది. వరుసగా గెలవడంతో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది అని ఆమె అంటోంది. ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన తండ్రి స్థానికంగా శిక్షణ ఇప్పించారు. కొన్నాళ్ళకు తొలిసారిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న దివ్యాంశి... సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇంకా ప్రోత్సహిస్తే మరింత రాణించగలదని ఆమె తండ్రి భావించారు. అప్పటి నుంచి అదే ఆమె లోకమైపోయింది. 2022కల్లా రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించుకుంది. క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగింది. దాదాపుమ ప్రతి పోటీలోనూ పతకం సాధిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఏడు పతకాలు, పదకొండు డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ టైటిల్స్‌, 2023లో ‘వరల్డ్‌ యూత్‌ ఛాంపియన్‌షి్‌ప- డబుల్స్‌’లో స్వర్ణం... ఆమె ఖాతాలో ఉన్నాయి.


44-navya.jpg

చాలా శ్రమ పడాల్సి వస్తోంది...

తాజాగా ‘ఏషియన్‌ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షి్‌ప- సింగిల్స్‌’లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను దివ్యాంశి సాధించింది. చైనీయుల ఆధిపత్యం ఉన్న ఈ టోర్నీలో... ముగ్గురు చైనా అమ్మాయిలపై నెగ్గి... స్వర్ణాన్ని అందుకోవడంలో ఈ గెలుపు మరింత ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం బాలికల అండర్‌-15 వరల్డ్‌-3 ర్యాంక్‌లో దివ్యాంశి కొనసాగుతోంది. ‘‘దీనికోసం చాలా శ్రమ పడాల్సి వస్తోంది. ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాల్సి వస్తోంది. మా కోచింగ్‌ క్యాంప్‌లు బెంగళూరులో జరుగుతాయి. ముంబై నుంచి అక్కడికి తరచూ వెళ్ళాల్సి వస్తోంది. మరోవైపు పదో తరగతి పరీక్షలకి సన్నద్ధం కావాలి. శిక్షణ తరువాత చదువుకోవడం కష్టమే అయినా మరో మార్గం లేదు. మార్కుల కోసం నాన్న, అమ్మ ఒత్తిడి చెయ్యరు. కానీ చదువులో వెనుకపడడం నాకు ఇష్టం లేదు. నా కుటుంబం, కోచ్‌ల సహకారంతో చదువును, క్రీడల్ని బ్యాలెన్స్‌ చేసుకుంటున్నా’’ అంటోందామె. ఈ ఏడాది నవంబర్‌లో రొమేనియాలో జరిగే ‘వరల్డ్‌ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షి్‌ప కోసం సన్నద్ధం అవుతున్న దివ్యాంశి... 2028 ఒలింపిక్స్‌లో మన దేశానికి స్వర్ణాన్ని సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది.

మా స్కూల్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను తప్పనిసరిగా అభ్యసించాలి. నేను టేబుల్‌ టెన్నిస్‌ ఎంచుకున్నాను. కానీ అప్పుడు దాన్ని సీరియ్‌సగా తీసుకోలేదు కొవిడ్‌ లాక్‌డౌన్‌లో అక్క హితాంశితో, ఒకప్పుడు క్రీడాకారుడైన తండ్రితో ఇంట్లోనే టేబుల్‌ టెన్ని్‌స ఆడేదాన్నిఅప్పుడే నాకు ఆ ఆట మీద ఇష్టం ఏర్పడింది

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 02:33 AM