Indias Rising Chess Star: చదరంగంలో దివ్య శకం
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:10 AM
దివ్యా దేశ్‌ముఖ్... ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు. ‘మహిళల చెస్ వరల్డ్ కప్’ గెలిచి, ‘గ్రాండ్‌మాస్టర్’ హోదా సాధించిన 19 ఏళ్ల దివ్యకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు...
దివ్యా దేశ్‌ముఖ్... ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు. ‘మహిళల చెస్ వరల్డ్ కప్’ గెలిచి, ‘గ్రాండ్‌మాస్టర్’ హోదా సాధించిన 19 ఏళ్ల దివ్యకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ‘ఆలోచించాల్సింది ప్రత్యర్థి ఎవరనేది కాదు, ఆటలో ఎలా గెలవాలనే దాని గురించే’ అంటుంది దివ్య.
దివ్య తండ్రి జితేంద్ర వైద్య కళాశాలలో ప్రొఫెసర్. తల్లి నమ్రత కూడా డాక్టరే! దివ్యను, ఆమె అక్కను బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చేయాలని తల్లితండ్రులు ప్రయత్నించారు. కానీ దివ్య చిన్నప్పుడు బలహీనంగా ఉండేది. బ్యాడ్మింటన్ ఆడే శక్తి ఉండేది కాదు. దీనితో దివ్య బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇంట్లో కూర్చుని ఆడే గేమ్ కాబట్టి చదరంగం వైపు ఆమె దృష్టి మళ్లింది. దివ్యకు చదరంగంలో తొలి కోచ్ ఆమె తండ్రే! కాలేజీ నుంచి వచ్చిన తర్వాత దివ్యతో ప్రతి రోజూ గేమ్ ఆడేవారు. దివ్య వేస్తున్న ఎత్తులకు చిత్తయిన జితేంద్ర ఆమెను సుప్రసిద్ధ కోచ్ రాహుల్ జోషి దగ్గర చేర్చారు. ఆ తర్వాత దివ్య ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు.
ఇంతింతై...
‘ఇంతింతై... వటుడింతై’ అన్నట్లు చిన్నప్పుడే అసాధారణ ప్రజ్ఞ కనబరచిన దివ్య- చెస్ సర్క్యూట్స్‌లో ఎదగటం మొదలుపెట్టింది. 2023 నాటికి ‘ఇంటర్నేషన్ మాస్టర్ హోదా’ సాధించింది. ఆ ఏడాది జరిగిన ఆసియా ఉమెన్ చెస్ ఛాంపియన్‌షి్‌పలో కోనేరు హంపీని ఓడించి సంచలనం సృష్టించి ఛాంపియన్‌గా నిలిచింది. 2024లో వరల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
అభిప్రాయాలు స్పష్టంగా...
చెస్ ఆడటానికి వేసే ఎత్తుల పట్ల స్పష్టత ఉండాలి. దివ్య తన మనస్సులోని అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. గత ఏడాది జనవరిలో నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో తనకు ఎదురయిన అనుభవాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఆ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ‘‘చాలా మందికి నా ఆట కన్నా.. నేను వేసుకున్న దుస్తులు.. మాట్లాడేటప్పుడు నా యాస.. నా జుట్టు వంటి అనవసర విషయాలపైనే ఆసక్తి ఎక్కువ. కొందరు అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. క్రీడాకారిణుల మీద అభిప్రాయాలు ఏర్పరుచుకోవటానికి ఆట ప్రాతిపదిక కావాలి. నా వేషభాషలు కాకూడదు’’ అని ఆమె పెట్టిన పోస్ట్‌తో... క్రీడా లోకంలో ఒక చర్చ ప్రారంభమయింది. కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. మరికొందరు విమర్శించారు. కానీ దివ్య వాటిని పట్టించుకోలేదు.
‘క్రీడాకారిణిగా ఎప్పటికప్పుడు నా లక్ష్యాలు మారుతూ ఉంటాయి. కానీ ఆటలో నేను పొందే ఆనందం మాత్రం శాశ్వతం. దాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను’’
ఇష్టమైన ఆటలు(చెస్ కాకుండా) - ఫుట్‌బాల్, సైక్లింగ్, ట్రెక్కింగ్
ఇవి కూడా చదవండి..
సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం