Share News

ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:58 AM

ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య పెరిగిన తరువాత డిప్లొమాలకు ఆదరణ తగ్గింది. ఉద్యోగం రావాలంటే ఎలాగూ బీటెక్‌ చేయాలి కదా అనే ఆలోచనే ఇందుకు కారణం కావచ్చు. అయితే డిప్లొమా పూర్తి చేయగానే....

ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా

కెరీర్‌ గైడ్‌

ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య పెరిగిన తరువాత డిప్లొమాలకు ఆదరణ తగ్గింది. ఉద్యోగం రావాలంటే ఎలాగూ బీటెక్‌ చేయాలి కదా అనే ఆలోచనే ఇందుకు కారణం కావచ్చు. అయితే డిప్లొమా పూర్తి చేయగానే ఉద్యోగం వచ్చే కోర్సులు కొన్ని ఉన్నాయి. అందులో ‘డిప్లొమా ఇన్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ’ ఒకటి. హైదరాబాద్‌లోని కులీకుతుబ్‌షా పాలిటెక్నిక్‌లో ఈ కోర్సు ఉంది. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. వందశాతం ప్లేస్‌మెంట్‌కు అవకాశం ఉన్న డిప్లొమా ఇది. ఈ కోర్సు చేసినవారు విదేశాల్లోనూ పనిచేయవచ్చు.

కోర్సు స్వరూపం

ప్రింటింగ్‌ అవసరం లేని వస్తువు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మార్కెట్‌ అవసరాల రీత్యా ఈ డిప్లొమాను మూడు సంవత్సరాల కోర్సుగా రూపొందించారు. ఆఫ్‌సెట్‌, గ్రావ్యూర్‌, ఫ్లెక్సోగ్రఫీ, స్ర్కీన్‌, డిజిటల్‌ ప్రింటింగ్‌ తదితరాల గురించి ఇందులో బోధిస్తారు. మొదటి రెండు సబ్జెక్టులు ప్రింటింగ్‌ గురించి ఉంటాయి. మిగిలిన సబ్జెక్టులు అన్నీ డిప్లొమాలతో సమానంగా చదవాల్సి ఉంటుంది. కోర్సులో భాగంగా వీరు ప్రముఖ ముద్రణ సంస్థల్లో ఇండస్ట్రియల్‌ విజిట్‌కు కూడా వెళతారు. చివరి సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.

ఉన్నత విద్యావకాశాలు

ఈ డిప్లొమా తరువాత ఈసెట్‌లో ర్యాంకు సాధించి ప్రింటింగ్‌ టెక్నాలజీలో బీటెక్‌ లేదా మెకానికల్‌, కంప్యూటర్స్‌, ఐటీ, ప్రొడక్షన్‌ తదితర ఇంజనీరింగ్‌ కోర్సులు కూడా చదవవచ్చు.

గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈ కోర్సు అందించే సంస్థలు

  • మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కర్ణాటక)

  • జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ (పశ్చిమ బెంగాల్‌)

  • కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, గిండీ (తమిళనాడు)

  • గురు జంబేశ్వర్‌ యూనివర్సిటీ (హరియాణ)

  • సింఘానియా యూనివర్సిటీ (రాజస్థాన్‌)

  • కాలికట్‌ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (కేరళ)

  • అవినాశలింగమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (తమిళనాడు)


క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఈ సంస్థలో చదివిన అందరికీ దాదాపుగా ఉద్యోగాలు లభిస్తాయి. మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రింటింగ్‌ సంస్థల్లోనే కాకుండా విదేశాల్లోని సంస్థల్లో కూడా ఉద్యోగాలు చేయవచ్చు. గత కొంత కాలంగా ఈ కోర్సులో చేరే అమ్మాయిల సంఖ్య కూడా పెరగడం గమనార్హం.

చిరునామా:

కులీ కుతుబ్‌షా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, చందూలాల్‌ బారాదరి, జూపార్క్‌ దగ్గర, రమ్నా్‌సపుర, హైదరాబాద్‌, తెలంగాణ - 500 064 ఫోన్‌: 9000058678, 9440746409, 9603660632

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 02:58 AM