Share News

Dia Binu Pulikkakandam: రికార్డు సృష్టించిన దియా

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:26 AM

రాజకీయాలు.. కురువృద్ధులకే సొంతం అనే రోజులకు కాలం చెల్లింది. విద్య, వ్యాపారాల్లో పోటీపడుతూ ముందుండే యువతరం.. రాజకీయ రంగాన్నీ విస్మరించడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు...

Dia Binu Pulikkakandam: రికార్డు సృష్టించిన దియా

జాతీయంగా ఈ పదవి సాధించిన అతి పిన్న

వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.

రాజకీయాలు.. కురువృద్ధులకే సొంతం అనే రోజులకు కాలం చెల్లింది. విద్య, వ్యాపారాల్లో పోటీపడుతూ ముందుండే యువతరం.. రాజకీయ రంగాన్నీ విస్మరించడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు మేమున్నామంటూ దూసుకొస్తున్నారు. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దియా బిను పుళిక్కకందమ్‌ అనే 21 ఏళ్ల యువతి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొట్టాయం జిల్లా పాలా మునిసిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికవడమే కాదు...

దియా వయసు 21 ఏళ్లు మాత్రమే. ఆమె మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏ కోసం సిద్దమవుతున్నారు. ఆమె కుటుంబానికి రాజకీయ అనుభవం ఉంది. పాలా మునిసిపల్‌ ఎన్నికల్లో దియా, ఆమె తండ్రి బినూ పుళిక్కకందమ్‌, బాబాయి బిజు... ముగ్గురూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి గెలిచారు. ఈ ముగ్గురితోపాటు మరో కాంగ్రెస్‌ నేత మాయా రాహుల్‌ కూడా మద్దతు ప్రకటించడంతో యుడిఎఫ్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో నలభై ఏళ్ల తరువాత పాలాలో కేరళ కాంగ్రెస్‌ పతిపక్షంలో నిలిచింది. యుడిఎ్‌ఫకు పుళిక్కకందమ్‌ కుటుంబానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం దియాకు ఛైౖర్‌ పర్సన్‌ కుర్చీ దక్కింది. మాయా రాహుల్‌కు వైస్‌ ఛైర్‌ పర్సన్‌ పదవి లభించింది.


దియా ఎన్నికతో కేరళలో యువ నాయకత్వానికి పెరుగుతున్న ఆదరణ మరోసారి బహిర్గతమైంది. గతంలో కూడా తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్‌(21), అరువాప్పులం పంచాయతీ అధ్యక్షురాలిగా రేష్మా మరియం రాయ్‌(21) పదవి బాధ్యతలు చేపట్టి రికార్డులు సృష్టించడం గమనించదగ్గ అంశం.

మా నాన్న ఎన్నికల్లో గెలుపొందడం ఇది అయిదోసారి. ఆయన ప్రజలకు చేస్తున్న సేవను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను కూడా అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజలకు సేవలందిస్తాను. సాధ్యమైనంత త్వరగా మునిసిపాలిటీలో ప్రాథమిక సదుపాయాలు అందేలా చూస్తాను. నాన్నే నాకు స్ఫూర్తి.

ఇవి కూడా చదవండి

టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!

అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..

Updated Date - Dec 28 , 2025 | 05:26 AM