Mental Health Drugs: డిప్రెషన్ మందులతో నాడీ సంబంధ ముప్పు
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:20 AM
కుంగుబాటు, ఆందోళన, నిద్ర సమస్యలకు వాడే మందుల వలన ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధి, అమియోట్రోఫిక్ లేటరల్ స్ల్కెరోసిస్ (ఎఎల్‌ఎస్) బారిన పడే ప్రమాదం ఉందని...
పరిశోధన
కుంగుబాటు, ఆందోళన, నిద్ర సమస్యలకు వాడే మందుల వలన ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధి, అమియోట్రోఫిక్ లేటరల్ స్ల్కెరోసిస్ (ఎఎల్‌ఎస్) బారిన పడే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ఆ అధ్యయన వివరాలివీ..
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన 21 ఏళ్ల వయసులో కండరాలకు సంబంధించిన అమియోట్రోఫిక్ లేటరల్ స్ల్కెరోసిస్ వ్యాధికి గురై చక్రాల కూర్చీకే పరిమితమైపోయారు. స్టీఫెన్ హాకింగ్‌ను వేధించిన ఇదే వ్యాధి మానసిక రుగ్మత మందుల వల్ల కూడా తలెత్తే ప్రమాదం ఉందనే ఒక అధ్యయనం జామా న్యూరాలజీలో ప్రచురితమైంది. డిప్రెషన్, ఆందోళన నిద్ర మాత్రల వలన ఎఎల్‌ఎస్ వచ్చే ప్రమాదముందని స్వీడన్ పరిశోధకులు ఆ అధ్యయనంలో వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వెయ్యి మంది పైగా ఏఎల్‌ఎస్ రోగులు, అయిదు వేలమందిపైగా ఆరోగ్యవంతుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. మానసిక వ్యాధుల మందులు వాడిన వారు తర్వాతి కాలంలో ఎఎల్‌ఎస్ బారిన పడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కోవకు చెందిన వారిలో ఎఎల్‌ఎస్ నిర్ధారణ కూడా ఆలస్యమవుతోందని, దాంతో కోలుకునే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. ఎఎల్‌ఎస్ ప్రారంభ దశలోనూ ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ లక్షణాలు ఉంటాయని దర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాిస్పిటల్ సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్ట్టర్ పాండు రంగ తెలిపారు. ఈ మందుల వలన ఎఎల్‌ఎస్ వస్తుందనే కచ్చితమైన రుజువు లేనప్పటకీ, నాడీ సంబంధిత వ్యాధుల లక్షణాలు ఉన్నవారికి ఈ మందులు సూచించేటప్పుడు వైద్యులు ఒక సారి ఆలోచించాలని సర్ గంగారామ్ హాస్పిటర్ వైస్ చైర్‌పర్సన్, డాక్టర్ అన్షు రోహత్గి అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి