CLAT 2026 Admissions: క్లాట్ 2026
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:16 AM
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాల్లో అందించే అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) లా ప్రొగ్రామ్‌లో ప్రవేశాల కోసం ‘క్లాట్’ నోటిఫికేషన్ వెలువడింది. జాతీయ స్థాయి ఎంట్రెన్స్ ఆధారంగా...
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాల్లో అందించే అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) లా ప్రొగ్రామ్‌లో ప్రవేశాల కోసం ‘క్లాట్’ నోటిఫికేషన్ వెలువడింది. జాతీయ స్థాయి ఎంట్రెన్స్‌ఆధారంగా ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్’(క్లాట్)-2026 అడ్మిషన్స్ జరుపుతారు. ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ లభిస్తుంది.
కోర్సులు:
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)
అర్హతలు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ పాసై ఉండాలి.
చివరి తేదీ: 2025 అక్టోబర్ 31
ఎంట్రెన్స్ తేదీ: 2025 డిసెంబర్ 7
వెబ్‌సైట్: consortiumofnlus.ac.in/
ప్రిపరేషన్:
క్లాట్‌కు సిద్ధం కావాలంటే మొదట సిలబ్‌సను అర్థం చేసుకోవాలి. తరువాత ఒక స్టడీ ప్లాన్‌ను తయారు చేసుకుని ముందుకు సాగాలి.. మాక్ టెస్ట్‌లు, గత సంవత్సరం ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రిపరేషన్ స్థాయిలను అంచనా వేసుకోవాలి. నిలకడైన ప్రిపరేషన్, చదివిన విషయాలను బాగా ఆకళింపు చేసుకోగలగడం, టైమ్ మేనేజ్‌మెంట్ తదితరాలు విజయానికి దగ్గరి మెట్లు.
సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్: ఇంగ్లి్‌ష, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ చాప్టర్లలను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్‌లో రోజు, వారం, నెల వారీ లక్ష్యాలను పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా రివైజ్ చేసుకోవాలి.
సెక్షన్ వెయిటేజీ: ప్రతీ సెక్షన్‌లో చాప్టర్ల వెయిటేజీని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. సబ్జెక్టుల వారీగా టైమ్‌టేబుల్ పెట్టుకోవాలి. బలహీనంగా ఉన్న వాటిని వదిలేయకుండా, దానిపై దృష్టిపెట్టాలి.
మార్కింగ్ స్కీమ్: క్లాట్‌లో నెగెటీవ్ మార్కింగ్ ఉంది. ర్యాండమ్ గెస్ వర్క్ మానేసి, తెలిసిన సమాధానాలు గుర్తించడం మంచిది.
క్లాట్‌లో పాల్గొనే విద్యా సంస్థలు
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(బెంగళూరు)
నేషనల్ అకాడమి ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ లా(నల్సార్-హైదరాబాద్)
నేషనల్ లా యూనివర్సిటీ(జోధ్‌పూర్)
నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌యూ-భోపాల్)
ద వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సె్‌స(కోల్‌కతా)
హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ(రాయ్‌పూర్)
గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ(గాంధీనగర్)
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివ్సటీ (లఖనవ్)
రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా(పటియాలా)
చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పట్నా
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీ్‌స(కోచి)
నేషనల్ లా యూనివర్సిటీ ఒడిషా(కటక్)
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా(రాంచీ)
నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జుడీషియల్ అకాడమి(అస్సాం)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ(విశాఖపట్నం)
ద తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ(తిరుచిరాపల్లి)
మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ముంబాయి)
మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(నాగపూర్)
మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఔరంగాబాద్)
హిమాచల్ ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ(సిమ్లా)
ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ(జబల్‌పూర్)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీ(సోనేపత్-హర్యాన)
నేషనల్ లా యూనివర్సిటీ త్రిపుర(అగర్తల)
గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ(సిల్వెస్సా)
(ఇవి కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు కళాశాలలు క్లాట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తున్నాయి)
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News