Share News

శ్వాసతో వ్యాధి నిర్థారణ

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:38 AM

వేలి ముద్రల్లాగే ప్రతి ఒక్కరి శ్వాస విధానం భిన్నంగా ఉంటుందనీ, శ్వాస ఆధారంగా వ్యక్తుల మానసిక, శారీరక రుగ్మతలను కనిపెట్టవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మరిన్ని వివరాలు....

శ్వాసతో వ్యాధి నిర్థారణ

మీకు తెలుసా?

వేలి ముద్రల్లాగే ప్రతి ఒక్కరి శ్వాస విధానం భిన్నంగా ఉంటుందనీ, శ్వాస ఆధారంగా వ్యక్తుల మానసిక, శారీరక రుగ్మతలను కనిపెట్టవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మరిన్ని వివరాలు....

శ్వాస ఆధారంగా వ్యక్తిగత ‘బ్రెత్‌ ప్రింట్‌’ను 97 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు కనిపెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు, వ్యక్తి ముక్కు నుంచి లోపలకూ, బయటకూ ప్రయాణించే గాలిని కొలిచే ఒక పరికరాన్ని తాజాగా అభివృద్ధి చేశారు. ఈ పరికరం గురించి మాట్లాడుతూ... ‘‘శ్వాస ప్రక్రియ సరళంగా కనిపించవచ్చు. కానీ ఈ ప్రక్రియ మెదడుతో ముడిపడి ఉంటుంది. భావోద్వేగాలు, ఆరోగ్యం శ్వాస ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. కాబట్టి శ్వాస ఆధారంగా ఆందోళన లాంటి వ్యక్తి మానసిక స్థితితో పాటు, బిఎమ్‌ఐ లాంటి భౌతిక అంశాలను కూడా కనిపెట్టవచ్చు. ఆందోళన స్వభావం కలిగిన వ్యక్తి నిద్ర సమయంలో శ్వాస ప్రక్రియ వేగంగా, తక్కువ నిడివితో సాగుతూ ఉంటుంది. అలాగే సదరు వ్యక్తి శ్వాస లయలో హెచ్చుతగ్గులు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. కాబట్టి శ్వాస ప్రక్రియ ఆధారంగా వ్యక్తిలోని మానసిక, శారీరక రుగ్మతలను అంచనా వేయగలుగుతాం’’ అంటూ న్యూరో సైంటిస్టులు వివరిస్తున్నారు. శ్వాస ప్రక్రియ యాంత్రిక ప్రక్రియ మాత్రమే కాదు, ఈ ప్రక్రియ మెదడు పనితీరును ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి బ్రెత్‌ ప్రింట్‌ ద్వారా కొంత మేరకు వ్యక్తి మానసిక, భౌతిక ఆరోగ్యాలను అంచనా వేయవచ్చు. అయుతే అంతమాత్రాన చికిత్సా ఈ ప్రకియ ద్వారానే చికిత్సా విధానం మీద పూర్తిగా ఆధారపడకుండా ఇతరత్రా వ్యాధి నిర్థారణ పరీక్షలను కూడా అనుసరించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:38 AM