Bhagavad Gita Teachings: రెండు దారులు
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:09 AM
ఎవరైనా తమ శక్తి యుక్తులను శత్రుత్వాల కోసం, ద్వేషం కోసం వినియోగిస్తూ ఉన్నంతకాలం తాము నష్టపోతారు, తమ శత్రువులకు రెట్టింపు నష్టం కలిగిస్తూ ఉంటారు. అందుకే వదలాల్సింది ద్వేషాన్ని కాని...
గీతాసారం
ఎవరైనా తమ శక్తి యుక్తులను శత్రుత్వాల కోసం, ద్వేషం కోసం వినియోగిస్తూ ఉన్నంతకాలం తాము నష్టపోతారు, తమ శత్రువులకు రెట్టింపు నష్టం కలిగిస్తూ ఉంటారు. అందుకే వదలాల్సింది ద్వేషాన్ని కాని కర్మను కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మనకు కాలం, శక్తి పరిమితంగా ఉంటాయి కాబట్టి వాటిని తెలివిగా ఉపయోగించుకోవాలి
మానవులు అనుసరించే రెండు భిన్నమైన మార్గాల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తూ... ‘‘వాటిలో ఒకటి తిరిగి వెనక్కి రానక్కరలేని ప్రకాశవంతమైన మార్గం. రెండోది మళ్ళీ తిరిగి వచ్చే చీకటి దారి. ప్రకాశవంతమైన మార్గం మన శక్తిని బ్రహ్మాన్ని చేర్చే అంతర్గత ప్రయాణం వైపు నడిపిస్తుంది. చీకటి దారి మన శక్తిని బహిర్గతమైన వాటివైపు, అంటే భౌతికతవైపు తీసుకు వెళుతుంది. దీనిప్రకారం ఫలాపేక్షతో కర్మలను చేసే కర్మయోగులు మరణించిన తరువాత మళ్ళీ జన్మిస్తున్నారు. ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేసేవారు జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు’’ అని స్పష్టం చేశాడు.
ఈ మార్గాల గురించి వివరించేటప్పుడు వేర్వేరు పేర్లను, గుణాలను ప్రస్తావించాడు. చీకటి మార్గాన్ని చావు, పుట్టుకలు అనే ధ్రువాల మధ్య ఊగిసలాడే లోలకం (పెండ్యులం) లాంటిదైతే, ప్రకాశవంతమైన మార్గం ... ఆ లోలకం తాలూకు ఇరుసును చేరుకోవడం లాంటిది. అది ధ్రువాలను అధిగమిస్తుంది. అది చేరుకొనేది ఒక్క బ్రహ్మాన్ని... అంటే పరమాత్మను మాత్రమే. ఈ మార్గాలను అర్థం చేసుకున్నవారు మోహానికి గురికాబోరని, యజ్ఞాలద్వారా, తపస్సు ద్వారా, దానాల ద్వారా ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయో... వాటన్నిటినీ అధిగమించి అత్యున్నతమైన బ్రహ్మాన్ని అంటే మోక్షాన్ని అటువంటి యోగులు పొందుతారని గీతాచార్యుడు తెలిపాడు.
కె.శివప్రసాద్
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News