Share News

Indoor Air Purifying Plants: ఇండోర్‌ ప్లాంట్స్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 02:20 AM

ఈ మొక్కలతో కాలుష్యం దూరం రానురానూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. పొగమంచు, కాలుష్యం కలగలసి శ్వాసకోశ వ్యవస్థకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఆరుబయట కాలుష్యాన్ని...

Indoor Air Purifying Plants: ఇండోర్‌ ప్లాంట్స్‌

ఈ మొక్కలతో కాలుష్యం దూరం రానురానూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. పొగమంచు, కాలుష్యం కలగలసి శ్వాసకోశ వ్యవస్థకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఆరుబయట కాలుష్యాన్ని అడ్డుకోలేకపోయినా, ఇళ్ల లోపల గాలిని వడగట్టుకునే సదుపాయాలను ఆశ్రయించే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇవిగో ఇలాంటి ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవాలి

స్నేక్‌ ప్లాంట్‌: దీన్ని పెంచుకోవడం ఎంతో సులభం. గాల్లో కలిసిన ఫార్మల్డిహైడ్‌, క్సైలీన్‌, టోలిన్‌లను పీల్చుకుని, రాత్రివేళ ఆక్సిజన్‌ను విడుదుల చేస్తుంది. కాబట్టి ఈ మొక్కను బెడ్రూమ్‌లో ఏర్పాటు చేసుకోవాలి

పీస్‌ లిల్లీ: అమ్మోనియా, అసిటోన్‌, ఇతరత్రా అస్థిర సేంద్రియ సమ్మేళనాలతో పాటు మోల్డ్‌ స్పోర్స్‌ను కూడా తగ్గిస్తుంది

స్పైడర్‌ ప్లాంట్‌: వేగంగా పెరిగే ఈ మొక్క గాల్లో కలిసిన ఫార్మాల్డిహైడ్స్‌ను తొలగిస్తుంది

అరెకా పామ్‌: సహజసిద్ధంగా గాల్లో తేమను పెంచే ఈ మొక్క గాల్లో కలిసిన ఫార్మాల్డిహైడ్‌తో పాటు క్సైలీన్‌ను కూడా తొలగిస్తుంది

మనీ ప్లాంట్‌: ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపించే ఈ మొక్క గాల్లో కలిసిన బెంజీన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌లను పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది

ఇంగ్లిష్‌ ఐవీ: ఈ మొక్క పలు రకాల గాలి కలుషితాలను తొలగిస్తుంది

రబ్బర్‌ ప్లాంట్‌: తక్కువ వెలుగును సైతం తట్టుకోగలిగే ఈ మొక్క గాలిలోని విషాలను తొలగిస్తుంది

డ్రాసెనా: ఇదొక గొప్ప ఎయిర్‌ ప్యూరిఫయర్‌. పలు రకాల డ్రాసెనా మొక్కలు దొరుకుతాయి. దేన్నైనా ఎంచుకోవచ్చు

చైనీస్‌ ఎవర్‌గ్రీన్‌: తక్కువ వెలుగులో ఏపుగా పెరిగే ఈ మొక్క కూడా గాల్లోని కలుషితాలను తొలగిస్తుంది

అలోవెరా: ఈ మొక్కకు కూడా కలుషితాలను పీల్చుకునే గుణం ఉంటుంది. అలాగే ఈ మొక్కలు రాత్రివేళ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి

బోస్టన్‌ ఫెర్న్‌: గాల్లోని తేమను పెంచడంతో పాటు ఆకర్షణీయమైన పూలతో ఆకట్టుకునే ఈ మొక్క గాలి కాలుష్యాన్ని కూడా హరిస్తుంది. అయితే ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడం కోసం తక్కువ వెలుగు సోకే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి


ఈ చిట్కాలు పాటించాలి

గాలి చొరబడేలా: కాలుష్యాన్ని హరించే మొక్కలను ఇళ్లలో పెంచుకోవడంతో పాటు, రాత్రివేళ కిటికీలు తెరచి ఉంచి గాలి చొరబడేలా చూసుకుంటే, ఈ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతూ, మంచి ఫలితాలను కనబరుస్తాయి

తగిన ప్రదేశం: స్నేక్‌ ప్లాంట్‌ లాంటి కొన్ని మొక్కలు రాత్రివేళ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి కాబట్టి వాటికి బెడ్రూమ్స్‌లో చోటు కల్పించాలి.

భద్రత: ఇంట్లో పెంపుడు జంతువులు, పిల్లలు ఉంటే, స్పైడర్‌ ప్లాంట్‌ లాంటి విషం లేని మొక్కలను ఎంచుకోవాలి. పీస్‌ లిల్లీ లాంటి గాలిని శుభ్రపరిచే కొన్ని మొక్కల విషపూరితమైనవి కాబట్టి వీటిని పెంపుడు జంతువులు, పిల్లలకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే

ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..

Updated Date - Dec 04 , 2025 | 02:20 AM