Share News

Skin Care: గంధం చర్మానికి వరం!

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:15 AM

శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో గంధం అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలను నివారించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు గంధంతో పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం!

Skin Care: గంధం చర్మానికి వరం!

చర్మ సమస్యలను నివారించడంలో, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో గంధం అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలను నివారించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు గంధంతో పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం!

ఒక గిన్నెలో ఒక చెంచా గంధం పొడి, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం పొడి, రెండు చెంచాల నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మొటిమలు రావు.

ఒక చెంచా గంధం పొడికి ఒక చెంచా కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మర్దన చేస్తే మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోతాయి. ఎండ వల్ల ఏర్పడే నలుపుదనం, కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుతాయి.

ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీ మట్టి, రెండు చెంచాల గంధం పొడి వేసి మూడు చెంచాల గులాబీ నీళ్లు చల్లుతూ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరవాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం నిగారిస్తుంది. నుదుటి మీద, పెదాల చుట్టూ ముడతలు రావు. మెడ భాగంలో నలుపు తగ్గుతుంది.

ఒక గిన్నెలో అరచెంచా గంధం పొడి, అరచెంచా ముల్తానీ మట్టి, ఒక చెంచా టమాటా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తరవాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం మీద జిడ్డు వదిలిపోతుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Updated Date - Jan 29 , 2025 | 01:34 AM