Share News

Benefits of Applying Ghee: ముఖానికి నెయ్యి రాస్తే

ABN , Publish Date - Nov 26 , 2025 | 01:19 AM

ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి...

Benefits of Applying Ghee: ముఖానికి నెయ్యి రాస్తే

ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

  • వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ముడుతలు, గీతలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించేందుకు యాంటీ ఏజింగ్‌ క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లు వాడేబదులు ముఖానికి నెయ్యి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు చర్మానికి పోషణను అందించే ఎ, డి, ఇ, కె విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.

  • నెయ్యిని ముఖానికి పట్టించి చేతి వేళ్లతో సున్నితంగా వృత్తాకారంలో మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మకణాలు వృద్ధి పొందుతాయి. దీంతో చర్మానికి సహజసిద్ధమైన మెరుపుదనం చేకూరుతుంది. ముఖానికి మేకప్‌ అవసరం రాదు.

  • వాతావరణ కాలుష్యం, ఎండ, దుమ్ము, ధూళి వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు, దద్దులు, ట్యానింగ్‌ లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు బయటి నుంచి రాగానే ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని కొద్దిగా పేరిన నెయ్యి రాసుకుంటే చాలు. మునుపటి నిగారింపు వచ్చేస్తుంది. నెయ్యిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.

  • రోజూ రాత్రి పడుకునేముందు ముఖానికి నెయ్యి రాసుకుంటూ ఉంటే చర్మం తేమతో నిండుతుంది. ముఖం ఛాయగా మెరుస్తుంది కూడా.

  • చిన్న గిన్నెలో ఒక చెంచా నెయ్యి, పావు చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముఖానికి పట్టించాలి. పావుగంటసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి...

ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 01:19 AM