Corn Beauty Benefits: అందానికి మొక్కజొన్న
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:44 AM
మొక్కజొన్నను చాలామంది ఇష్టంగా తింటారు. దానితో వంటలూ చేస్తారు. అయితే మొక్కజొన్న అందాన్ని పెంచండంతో సహాయపడుతుందని తెలుసా..? ఆ వివరాలు తెలుసుకుందాం...
మొక్కజొన్నను చాలామంది ఇష్టంగా తింటారు. దానితో వంటలూ చేస్తారు. అయితే మొక్కజొన్న అందాన్ని పెంచండంతో సహాయపడుతుందని తెలుసా..? ఆ వివరాలు తెలుసుకుందాం...
మొక్కజొన్నలో విటమిన్ ఎ, సి, డి ఉంటాయి. ఇవి చర్మం మీది నల్లటి మచ్చలను తగ్గిస్తాయి.
విటమిన్ ఇ చర్మం పొడిబారే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కాపర్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నిషియం వంటి ఖనిజాలు ముడతలు, మచ్చలను మాయం చేస్తాయి.
విటమిన్ ఇ పొడిబారకుండా సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.
మొక్కజొన్నలోని కొన్ని రకాల అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి.
ఇలా వాడాలి:
మొక్కజొన్న పిండిలో కొంచెం తేనె, పాలు కలిపి పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. దీని వలన చర్మం మృదువుగా మారుతుంది.
మొక్కజొన్న పిండిలో పసుపు, పెరుగు వేసి కలిపి మెత్తని మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మీది మచ్చలు పోయి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ఒక గిన్నె మొక్కజొన్న పిండి, తేనె, కొంచెం నిమ్మరసం, నీరు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకు రాసి సున్నితంగా రుద్దాలి. దీని వలన చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి.
మొక్కజొన్న పిండిలో కీరదోస గుజ్జును క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మం తేమను కోల్పోకుండా సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్