Share News

Dandruff: చుండ్రు వేధిస్తోందా..!

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:39 AM

వాతావరణ మార్పులు, శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం వల్ల తలలో చుండ్రు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దురద, శిరోజాలు రాలడం లాంటి పలు సమస్యలు వేధిస్తుంటాయి. ఇంట్లో దొరికేవాటితోనే చుండ్రుని తగ్గించే మార్గాల గురించి తెలుసుకుందాం!

Dandruff: చుండ్రు వేధిస్తోందా..!

రెండు అంగుళాల కలబంద ముక్క నుంచి గుజ్జుని తీసుకుని మాడుకు పట్టించాలి. అయిదు నిమిషాలు సన్నితంగా మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే పది రోజుల్లో చుండ్రు తగ్గుతుంది.

రాత్రి పడుకునేముందు చిన్న గిన్నెలో మూడు చెంచాల ఆలివ్‌ నూనె వేసి కొద్దిగా వేడి చేయాలి. దీనిని కొద్దిగా వేళ్లతో తీసుకుంటూ తలకి పట్టించాలి. మాడు మీద గుండ్రంగా రుద్దుతూ మర్దన చేయాలి. ఉదయం లేవగానే మైల్డ్‌ షాంపూతో తలస్నాం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

చిన్న గిన్నెలో ఒక గరిటె పెరుగు, గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చుండ్రు ఉన్న ప్రదేశంలో రాయాలి. పావు గంట తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. క్రమంగా చుండ్రు రాలడం ఆగుతుంది.


మూడు చెంచాల మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే వీటిని మెత్తగా రుబ్బి తలకు పట్టించాలి. అరగంట తరవాత తలస్నానం చేస్తే మాడుమీద చర్మానికి తేమ అంది చుండ్రు తగ్గుతుంది.

రెండు గుప్పెళ్ల వేపాకులను మెత్తగా రుబ్బి మాడుకు పట్టించాలి. అరగంట తరవాత మంచినీళ్లతో తలస్నానం చేస్తే ప్రయోజనం కనిపిస్తుంది.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌కు చర్మం మీద పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేసే శక్తి ఉంది. ఒక గిన్నెలో రెండు చెంచాల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, రెండు చెంచాల నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలంతా రాయాలి. పావు గంట ఆరాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తీరుతుంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:39 AM